kissing Tips: ముద్దులతో మొదలుపెడితేనే లైంగిక ఆనందం
కొన్నిసార్లు సెక్స్‌ను ఆహ్లాదకరంగా మార్చడానికి లైంగిక ప్రవేశం సరిపోదు.
- By Balu J Published Date - 06:21 PM, Wed - 5 April 23
సెక్స్ అంటే రెండు, మూడు నిమిషాల్లో ముగిసే కార్యం కాదంటున్నారు సెక్సాలజిస్ట్ లు. కొన్నిసార్లు సెక్స్‌ను ఆహ్లాదకరంగా మార్చడానికి లైంగిక ప్రవేశం సరిపోదు. ఇది భావప్రాప్తిని కలిగిస్తుంది కానీ అనుకున్నంతగా ఆనందం ఇవ్వదు. సెక్స్ టైంలో అవసరమైన ఫోర్‌ప్లే లేకపోతే మహిళలు తమ మూడ్ ను కోల్పోయి లోలోపల భాగస్వామిపై అసహనం వ్యక్తం చేస్తారు. లైంగిక మజాను అస్వాదించడంలో ముద్దుల గురించి మొదటగా చెప్పుకోవాలి. భాగస్వామి ఇష్టాలను గ్రహించి ముద్దులు పెడితే ఫోర్‌ప్లే కంటే ఎక్కువగా ఉత్తేజపరుస్తుంది. పడకగదితో ప్రియుడు లేదా ప్రియురాలికి లైంగిక ఆనందం ఇవ్వాలంటే ఎలా ముద్దు పెట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలి.
ముద్దులతో సెక్స్ ను కొనసాగించడం వల్ల ఇరువురి ఉద్రేకాలు తారస్థాయికి చేరుతాయి. పెదవులపై సున్నితమైన ముద్దులు ఇస్తే ఆ మజాయే వేరు. భాగస్వామికి ఇష్టమైన ప్రదేశాల్లో ముద్దులు పెట్టడం వల్ల అంతులేని ఆనందం సొంతం చేసుకోవచ్చు.
ముద్దు విషయంలో ప్రతి ఒక్కరికి వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి. వారికి నచ్చినట్లు అనిపిస్తే అంటే సానుకూలంగా ప్రతిస్పందించండి. కేవలం లిప్ కిస్ మాత్రమే కాకుండా శరీరంలోని పలు చోట్లా ముద్దులు పెడితే మరింత సెక్స్ ను అనుభవించేందుకు దారితీస్తుంది.
ముద్దు పెట్టుకునేటప్పుడు మీ చేతులు ఏమి చేయగలవని తక్కువ అంచనా వేయకండి. మీరు ముద్దు పెట్టుకునేటప్పుడు మీ భాగస్వామి శరీరాన్ని తాకడానికి, లాలించడానికి మీ చేతులను ఉపయోగించండి. ఇది లైంగిక బంధాన్ని పెంచడానికి దారితీస్తుంది. అంతే కాదు.. ఇద్దరికీ అత్యంత ఆనందాన్ని ఇస్తుంది.
Tags
Related News
Gujarat : 200 కోట్ల సంపదను విరాళంగా ఇచ్చి..సన్యాసం స్వీకరించిన గుజరాత్ దంపతులు
Gujarat couple: గుజరాత్‌కు చెందిన ఒక సంపన్న జైన దంపతులు.. భవేష్ భండారీ మరియు అతని భార్య దాదాపు ₹200 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతే కాకుండా వారు సన్యాసం కూడా స్వీకరించారు. హిమ్మత్‌నగర్‌కు చెందిన ఈ జంట ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో తమ మొత్తం సంపదను విరాళంగా ఇచ్చారు. ఈ నెలాఖరులో జరిగే ఒక కార్యక్రమంలో త్యజించే జీవితానికి కట్టుబడి ఉన్నారు. వారి 9 ఏళ్ల కుమార్తె మరియు 16 ఏళ్ల కుమారుడు 2022లో […]