ఈ నూనె జుట్టుకు రాస్తే శని దోషం పోయి.. ఐశ్వర్యం మీ వెంటే ఉంటుందట?
శని దేవుడిని న్యాయదేవుడిగా పిలుస్తూ ఉంటారు. అంటే మనం చేసే పనులను బట్టి మనకు శని దేవుడు ఫలాలను
- By Nakshatra Published Date - 04:19 PM, Wed - 5 October 22
శని దేవుడిని న్యాయదేవుడిగా పిలుస్తూ ఉంటారు. అంటే మనం చేసే పనులను బట్టి మనకు శని దేవుడు ఫలాలను అందిస్తాడు అని నమ్ముతూ ఉంటారు. అలాగే చిన్ని దేవుడిని కర్మధాత అని కూడా అంటూ ఉంటారు. మంచి పనులు చేసే వారికి శని దేవుడు మంచి ఫలితాలను ఇస్తాడని, చెడు పనులు చేసే వారికి శని దేవుడు చెడు ఫలితాలను ఇస్తాడు. అయితే శని దేవుడిని పూజించి శని దేవునికి ఇష్టమైన నూనెను నైవేద్యంగా పెట్టడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.
అలాగే అనేక సమస్యల నుంచి బయటపడి ఉపశమనం కూడా లభిస్తుంది. అదేవిధంగా జుట్టుకు సరైన నూనెను అప్లై చేయడం వల్ల కూడా శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. మరి శని దేవుని అనుగ్రహం కోసం ఎటువంటి నూనె తలకు రాయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరానికి మసాజ్ చేయడానికి నూనె ను ఉపయోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలా చేయడం వల్ల అలసట మరియు బలహీనత తగ్గిస్తుంది. కండరాలు బలపడతాయి. చర్మం కూడా మెరుస్తుంది.
అదేవిధంగా తలకు మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తద్వారా జుట్టు మృధువుగా దృఢంగా నల్లగా మారి రక్త ప్రసరన కూడా బాగా జరుగుతుంది. అంతేకాకుండా శని దేవుని అనుగ్రహంతో సంపద అలాగే గౌరవం కూడా పెరుగుతుంది. సోమవారం సమయంలో జుట్టుకు నూనెను మర్దన చేయడం వల్ల అందం మరింత పెరగడంతోపాటు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. బుధవారం ఆయిల్ మసాజ్ చేయడం ద్వారా శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారు. అలాగే బుధవారం రోజు శరీరం, అలాగే జుట్టుకు నూనెను మర్దన చేయడం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే శుక్రవారం రోజు నూనెను రాసుకోవడం వల్ల అందం ఆకర్షణ పెరుగుతుంది. శనివారం రోజు శరీరానికి తలకు నూనె రాసుకోవడం వల్ల శని దోషం తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుంది. అయితే ఆది మంగళ గురువారాలలో నూనె రాసుకోవడం లాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల దన నష్టం కలిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Tags
Related News
Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!
మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాల�