Hair Fall: వారానికి ఒక్కసారి ఈ ఒక్క లడ్డు తింటే చాలు జుట్టు రాలడం ఆగిపోవాల్సిందే!
అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే లడ్డుని వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు జుట్టు రాలడం ఆగిపోతుంది అని చెబుతున్నారు. ఆ లడ్డు ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Sat - 3 May 25

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలా మంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో జుట్టు రాలడం సమస్య కూడా ఒకటి. అధిక హెయిర్ ఫాల్ కారణంగా మగవారు బట్టతల సమస్యతో బాధపడుతుంటే ఆడవారు పొట్టి జుట్టు పలుచని జుట్టుతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువగా మారింది. ఈ హెయిర్ ఫాల్ సమస్యను అరికట్టడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే లడ్డుని వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు అధిక హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.
ఇంతకీ ఆ లడ్డు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మార్కెట్లో హలీమ్ గింజలు అని దొరుకుతాయి. చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. వాటితో చేసే ఈ లడ్డు మనకు జుట్టును ఊడిపోకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేశీ నెయ్యి 1 టీస్పూన్, తురిమిన కొబ్బరి 2 కప్పులు, బెల్లం 2 స్పూన్, హాలీమ్ గింజలు అర కప్పు తీసుకోవాలి. లడ్డు తయారు చేసే ముందు హలీమ్ గింజలను గంటసేపు నానబెట్టాలట. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలట. అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడి అవ్వగానే తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలట.
ఆ తర్వాత ఇప్పుడు దీనిలోనే నాన పెట్టిన హలీం గింజలు నీరు లేకుండా వేయాలి. వాటిని కూడా కాస్త వేయించి ఆ తర్వాత బెల్లం కూడా వేయాలి. చిన్న మంటపై అన్నింటినీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని కాస్త చల్లారనిచ్చి ఆ తర్వాత లడ్డూల మాదిరి చుట్టుకుంటే సరిపోతుందట. ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలలో మాంస కృత్తులు, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ కి అద్భుతమైన మూలం. మీరు వారానికి 1 లేదా 2 లడ్డూలను తీసుకుంటే, జుట్టు రాలడం, అలసట, తక్కువ హిమోగ్లోబిన్ వంటి చాలా రకాల సమస్యలను తగ్గిస్తుందట. శరీరంలో ప్రోటీన్ ,రక్తం లేకపోవడంతో, జుట్టు రాలడం కూడా సంభవిస్తుందట. అయితే రక్తం లేకపోవడం వల్ల రక్తహీనత సంభవిస్తుందట. అటువంటి పరిస్థితిలో, ఈ లడ్డూలను తినడం వల్ల మీకు మేలు చేకూరుతుందని, రుచి కూడా అద్బుతంగా ఉంటుందని చెబుతున్నారు.