Aging: వయసుకు మించి కనిపిస్తున్నారు అనడానికి ఇవే సంకేతాలు!
ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చిన వయసు అనేది మాత్రం ఆగదు. ఒక మనిషికి రోజు రోజుకు వయసు పెరుగుతూ మరణం అంచులకు మనం చేరుకున్నట్లే.
- By Anshu Published Date - 07:30 PM, Sun - 31 July 22

ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చిన వయసు అనేది మాత్రం ఆగదు. ఒక మనిషికి రోజు రోజుకు వయసు పెరుగుతూ మరణం అంచులకు మనం చేరుకున్నట్లే. అయితే కొందరు చూడటానికి చాలా తక్కువ వయసు ఉన్న వారు ఇలా కనపడుతూ ఉంటారు అలాగే మరికొందరు వారి శరీర తత్వాన్ని బట్టి చిన్న వయసు అయినప్పటికీ ఎక్కువ వయసు ఉన్న వారిలా కనపడతారు. అయితే చాలామంది ఈ విషయాన్ని గుర్తించరు. అయితే మనలో ఉండే కొన్ని లక్షణాలే మనం వయసుకు మించిన వారిలా కనపడుతున్నామని తెలియజేస్తాయి. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
ఆవకాయ తినాలని జాడీ తెరవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ జాడీ మూత ఎంతసేపటికి తెరచుకోదు. ఇలా తెరచుకోకపోయేసరికి మనం తినడం కూడా మానేస్తాము. ఇలా ఎప్పుడైతే ఒక జాడి మూత మనం తెరవలేక పోతున్నామో అప్పుడే మనం మన వయసుకు మించి కనపడుతున్నామని అర్థం. ఇకపోతే మీకు ఎంతగానో నచ్చిన ప్యాంటు వేసుకునేటప్పుడు నడుము భాగంలో బిర్రుగా ఉండి కాలికింది భాగంలో వదులుగా ఉంటే మీరు అత్యధిక వయసు ఉన్న వారిలా కనిపిస్తున్నారని అర్థం.
మీ వయసును బట్టి మీరు చిన్న పిల్లల మాదిరి నిద్రపోవాలని ప్రయత్నం చేసినప్పటికీ మధ్య మధ్యలో మెలకువ వస్తుందంటే మీరు ఉన్న వయసు కన్నా పెద్దగా కనబడుతున్నారని తెలియజేసే సంకేతం. ఇక మన చర్మం పొడిబారడం దళసరిగా మారడం కూడా వయసు పెరుగుతుందని చెప్పడానికి సంకేతమే.ఇక చాలామంది మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటే మీ వయసు పై బడుతుందని అర్థం. ఇక మహిళలలో నెలసరి సరిగా రాకపోవడం కూడా దీనికి సంకేతమే ఇలాంటి లక్షణాలు కనుక మీలో కనపడితే వెంటనే జాగ్రత్తపడి సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.