Symptoms of Cancer: మీక్కూడా ఈ లక్షణాలున్నాయా ? అయితే క్యాన్సర్ కావొచ్చు..
రాత్రివేళ కొందరికి చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. అలాగే హఠాత్తుగా బరువు తగ్గటం, అధిక జ్వరం రావడం వంటి లక్షణాలు ఉన్నా.. ఇవి లింఫోమా లేదా లుకేమియా క్యాన్సర్ కు సంకేతం.
- By News Desk Published Date - 08:00 PM, Mon - 26 August 24

Symptoms of Cancer: ఇప్పుడున్న జీవనశైలిలో.. ప్రతిఒక్కరూ తరచూ ఏదో ఒక రోగం బారిన పడుతున్నారు. పిల్లలు, పెద్దలనే తేడా లేదు. మూడు పదుల వయసైనా రాకుండానే గుండెపోటుతో చనిపోతున్నారు. మన శరీరంలో గుండె జబ్బుల తర్వాత.. అంత ఎఫెక్ట్ చూపేది క్యాన్సర్. శరీరంలోని అవయవాలను తినేస్తుంటుంది. భారత్ లో ఏటా సుమారుగా 11 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వారిలో చాలామంది మరణిస్తున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ లతో బాధపడుతున్నవారు అధికం. క్యాన్సర్ సోకిందో లేదో వెంటనే తెలియదు. అది థర్డ్ స్టేజ్ లో ఉండగానో.. ఫైనల్ స్టేజ్ లో ఉండగానో తెలుస్తుంది. ట్రీట్మెంట్ తీసుకునే లోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. జుట్టురాలడం, కణితలు ఉండటమే కాదు.. సహజ లక్షణాలు కూడా క్యాన్సర్ ను సూచిస్తాయి.
దగ్గ రావడం తగ్గాక.. గొంతు బొంగురుపోతే అది క్యాన్సర్ కు లక్షణం కావొచ్చు. చాలాకాలంగా దగ్గు వస్తున్నట్లయితే ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. సిగరెట్ తాగినవారికి, తాగనివారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆహారం మింగేటపుడు కూడా గొంతులో ఏదైనా అడ్డుగా ఉందనిపించినా అది మౌత్, స్టమక్ క్యాన్సర్లకు సంకేతం.
రాత్రివేళ కొందరికి చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. అలాగే హఠాత్తుగా బరువు తగ్గటం, అధిక జ్వరం రావడం వంటి లక్షణాలు ఉన్నా.. ఇవి లింఫోమా లేదా లుకేమియా క్యాన్సర్ కు సంకేతం. మీకు గుండెల్లో మంటగా ఉన్నా, ఛాతీలో మంటగా ఉన్నాఅశ్రద్ధ చేయకండి.
చర్మం కింద గడ్డలు ఏర్పడి, అవి నొప్పిలేకుండా ఉన్నా.. నోటిలో పుండ్లు మందులకు తగ్గకపోయినా, చర్మంపై దురద తగ్గకపోయినా, చెవిలో నొప్పి వేధిస్తున్నా.. అశ్రద్ధ చేయకుండా వెంటనే టెస్ట్ చేయించుకోండి. ఇవి లింఫోమా, నోటి క్యాన్సర్, పొట్టక్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంది.
Also Read: Drumstick Leaves: వారానికి ఒక్కసారైనా ఈ ఆకు తీసుకుంటే చాలు.. షుగర్ అదుపులో ఉండాల్సిందే!