HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >The Prices Of Gold And Silver In The Bullion Market Are As Follows

Gold : శ్రావణం ముగిసింది, ఇక బంగారం ధరల్లో భారీపతనం, తులం బంగారం ఎంత పడిందంటే..?

భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం లాగే ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

  • Author : hashtagu Date : 02-09-2022 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold- Silver Price
Gold

భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం లాగే ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం చాలా చౌకగా మారింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.50401కి చేరింది. గురువారం నాడు రూ.51188 వద్ద పలికినట్లు గమనించవచ్చు.

ఇతర స్వచ్ఛత కలిగిన బంగారం, వెండి ధర గురించి మాట్లాడినట్లయితే, 916 స్వచ్ఛత కలిగిన 22 క్యారట్ల బంగారం ధర రూ.46167కు పడిపోయింది. అదే సమయంలో 18 క్యారట్ల బంగారం ధర రూ.37801కి చేరింది. ఇక 999 స్వచ్ఛత కలిగిన ఒక కేజీ వెండి ఈ రోజు రూ.51850 కే అందుబాటులో ఉంది.

బంగారం, వెండి ధరలు ఎంత మేర తగ్గాయి?
ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 999 స్వచ్ఛత కలిగిన 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర నేడు రూ.787 తగ్గగా, 916 స్వచ్ఛత కలిగిన 22 క్యారట్ల బంగారం ధర ఈరోజు రూ.721 తగ్గింది. మరోవైపు 999 స్వచ్ఛత కలిగిన కిలో వెండి ధర నేడు రూ.2500 తగ్గింది.

బంగారు నగల స్వచ్ఛతను నిర్ధారించడానికి ఒక మార్గం ఉంది. ఇందులో హాల్‌మార్క్‌కు సంబంధించిన అనేక రకాల గుర్తులు కనిపిస్తాయి. ఈ ముద్రల ద్వారా నగల స్వచ్ఛతను గుర్తించవచ్చు. ఇది ఒక క్యారెట్ నుండి 24 క్యారెట్ల వరకు స్కేల్ కలిగి ఉంటుంది. 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. ఆభరణాలపై హాల్‌మార్క్ వేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైన బంగారం, దానిపై 999 మార్క్ నమోదు చేసి ఉంటుంది.

అయితే, 24 క్యారెట్ల బంగారంతో నగలను తయారు చేయరు. 22 క్యారెట్ల బంగారంతోనే నగలు తయారు చేస్తారు. దీనిపై 916 కేడీఎం అని రాసి ఉంటుంది. 18 క్యారెట్ల ఆభరణాలపై 750 అని రాసి ఉంది. 14 క్యారెట్ల నగలు ఉంటే అందులో 585 అని రాసి ఉంటుంది.

24, 22, 21, 18 మరియు 14 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అంటారు. ఇందులో మరే ఇతర లోహం కల్తీ ఉండదు. దీనిని 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం అంటారు. 22 క్యారెట్ల బంగారంలో 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం. మిగతా 8.33 శాతం ఇతర లోహాలతో కూడి ఉంటుంది. అదే సమయంలో, 87.5 శాతం స్వచ్ఛమైన బంగారం 21 క్యారెట్ల బంగారంలో ఉంది. 18 క్యారెట్లలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుది. ఇక 14 క్యారెట్ల బంగారంలో 58.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bullion market
  • gold
  • gold price
  • silver

Related News

Gold prices drop—a great opportunity for buyers.

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

భారత్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, గత ఏడాదిగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd