Tea Effects: పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?
Tea Effects: మనలో చాలా మంది ఒకరోజులో ఒక పూట అందం లేకపోయినా ఉండగలరు కానీ రోజుకి ఒక్కసారి అయినా టీ లేదా కాఫీ తాగకుండా అసలు ఉండలేరు.
- By Anshu Published Date - 08:40 AM, Thu - 20 October 22

Tea Effects: మనలో చాలా మంది ఒకరోజులో ఒక పూట అన్నం లేకపోయినా ఉండగలరు కానీ ,రోజుకి ఒక్కసారి అయినా టీ లేదా కాఫీ తాగకుండా అసలు ఉండలేరు. ఇంకొంతమందికి ఉదయం లేచిన తర్వాత మొదట కాఫీ టీ తాగిన తర్వాతే వారి తర్వాతి పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఒకరోజు కాఫీ తాగకపోతే ఆరోజు అంతా కూడా పిచ్చి పట్టినట్టుగా ఉంది అని అంటూ ఉంటారు. అంతలా కాఫీ టీలకు ఎడిక్ట్ అయిపోయారు. అయితే కాఫీ, టీ లు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ వాటిని ఎక్కువగా తాగకూడదు అని చెబుతూ ఉంటారు.
మరి పరగడుపున టీ కాఫీలాంటి తాగడం ఆరోగ్యానికి మంచిదా కాదా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి సమయంలో మనం ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటాం. అంటే 8 గంటలపాటు నిద్రపోయిన తర్వాత ఖాళీ కడుపుతో టీ కాఫీలు తాగడం వల్ల అది అనేక విధాలుగా ప్రభావితం కావచ్చు. ఉదయం పూట మొదటి ద్రవంగా టీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం ఉండదు, కానీ దాని మూత్రవిసర్జన ప్రభావం వల్ల మిమ్మల్ని నిర్జలీకరణం చేస్తుంది, ఇది తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం కూడా గట్ బ్యాక్టీరియాను,జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దాంతో అది ఉబ్బరం, అజీర్ణానికి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది తలనొప్పిని కూడా ప్రేరేపిస్తుంది.
మరి టీ తాగకూడదా అంటే తాగవచ్చు కానీ దానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఒక కప్పు టీతో మీ రోజున ప్రారంభించడం వల్ల కడుపులో ఆమ్లాలు ఏర్పడతాయి. అవి జీర్ణక్రియ పై ప్రభావం చూపడంతో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. భారతదేశంలో వివిధ ప్రదేశా లలో టీ ని కొన్ని సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తూ ఉంటారు. వీటితో పాటు పాలు లేకుండా గ్రీన్ టీ బ్లాక్ టీ ఆకులతో తయారుచేసి వాటిలో పంచదార నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. లేదంటే పాలు నిమ్మకాయ ముక్కలు వాడకం అసిడిటీని ప్రేరేపిస్తాయి. తద్వారా జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి, ఎందుకంటే టీలోని కెఫిన్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, నిమ్మకాయలలోని సిట్రిక్ యాసిడ్ మరియు పాలలో లాక్టిక్ యాసిడ్ కలిపినప్పుడు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి.