Masala Vada: టేస్టీ మసాలా వడలు.. బ్రెడ్‌తో ఇన్‌స్టాంట్‌గా తయారు చేసుకోండిలా?
మామూలుగా మనం ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ లో రకరకాల వడలు తింటూ ఉంటాం. శనగపిండి వడలు శనగపప్పు వడలు అలసంద వడలు మిరపకాయ బజ్జి ఇలా ఎ
- Author : Anshu
Date : 13-02-2024 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా మనం ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ లో రకరకాల వడలు తింటూ ఉంటాం. శనగపిండి వడలు శనగపప్పు వడలు అలసంద వడలు మిరపకాయ బజ్జి ఇలా ఎన్నో రకాల వడలు తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా బ్రెడ్ తో చేసిన మసాలా వడలుతున్నారా. అది కూడా ఇన్స్టంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకుని తినవచ్చు. అది ఎలాగో అందుకే ఏం పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం..
కావాల్సిన పదార్థాలు :
బ్రెడ్ – 3
క్యారెట్ – 1
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 2
గరం మసాలా – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
పుదీనా – కొంచెం
కొత్తిమీర – కొంచెం
అల్లం – అర టీస్పూన్
జీలకర్ర – పావు టీస్పూన్
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్లు
నూనె – ఫ్రైకి సరిపడేంత
తయారీ విధానం
ఇందుకోసం ముందుగా క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా, తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సి గిన్నె తీసుకుని దానిలో బ్రెడ్‌ను ముక్కలుగా చేసి వేయాలి. దానిలో అల్లం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. కూరగాయల్లోని నీరు సరిపోకపోతే కాస్త నీరు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో బియ్యం పిండి వేసి మరోసారి బాగా కలపాలి. స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో నూనె వేసి వేడి చేయాలి. ముందు తయారు చేసుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా వత్తుకోవాలి. అయితే బాగా ఉబ్బినట్లు కాకుండా కాస్త పలుచగా ఉండేట్లు వత్తు కోవాలి. ఇలా చేస్తే వడలు రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని వేడి అయిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు రెడీ.