Beauty Care: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం?
మామూలుగా చాలామంది చర్మ సౌందర్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చర్మం నిర్జీవంగా కనిపించడంతో పాటు డల్ గా కూడా కనిపిస్తూ
- By Nakshatra Published Date - 09:40 PM, Thu - 31 August 23
మామూలుగా చాలామంది చర్మ సౌందర్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చర్మం నిర్జీవంగా కనిపించడంతో పాటు డల్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. దీంతో చర్మ నిగారింపు కోసం చాలా మంది ఏవేవో బ్యూటీ ప్రాజెక్టులు హోమ్ రెమిడీలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం పొందడానికి మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారాలు, పానీయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చర్మ సౌందర్యం కావాలనుకునే వారు ఉదయం పరగడుపున కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపవచ్చు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటి అన్న విషయానికి వస్తే..
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగితే, చర్మానికి అద్భుతాలు జరుగుతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను రక్షిస్తుంది. ముడతలు గీతలను నివారిస్తుంది. విటమిన్ సి చర్మానికి లోపలి నుంచి పోషణ అందించి, టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసుకుని తాగితే మీ చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. చాలామంది వాళ్ల రోజును టీతోనే ప్రారంభిస్తారు.
అయితే, మీకు మెరిసే చర్మం కావాలంటే, మీ రెగ్యులర్ చాయ్‌కు బదులుగా ఒక కప్పు గ్రీన్ టీని ఎంచుకోవాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మకణాలను ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మేలు చేస్తుంది. గ్రీన్ టీలోని విటమిన్ ఇ, చర్మానికి తేమను అందిస్తుంది. పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో కొంచెం పసుపు వేసుకుని తాగితే కాంతివంతమైన చర్మం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. పసుపు లోని యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు వయసు మళ్లిన ఛాయలు కనిపించకుండా చేస్తాయి. చర్మం మీద మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడుతుంది. చర్మం మీద ఉండే మృత కణాలను తొలగించి, చర్మం మెరిసేలా చేస్తుంది. కళ్ల కింద వచ్చే నల్లని వలయాలను తొలగిస్తుంది. చర్మానికి మెరుపుదనాన్ని ఇస్తుంది.
Related News
Glowing Skin: ముఖంపై మచ్చలు తగ్గాలి అంటే టమోటాతో ఇలా చేయాల్సిందే?
టమోటాల వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి.