Soya Manchurian: ఎప్పుడైనా సోయా మంచూరియా తిన్నారా.. అయితే సింపుల్ గా ట్రై చేయండిలా?
మంచూరియా అనగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది గోబీ మంచూరియా. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ గోబీ మంచూరియా
- By Nakshatra Published Date - 07:00 PM, Sat - 16 March 24
మంచూరియా అనగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది గోబీ మంచూరియా. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ గోబీ మంచూరియాని ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు గోబీ మంచూరియానే కాకుండా ఎప్పుడైనా సోయా మంచూరియా తిన్నారా. అయితే చాలామంది వీటిని ఇంట్లో ట్రై చేయాలని అనుకున్నప్పటికీ బయట రెస్టారెంట్లో హోటల్స్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసిన అంత టేస్ట్ రాదు. మరి రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ టేస్ట్ రావాలంటే ఈ రెసిపీ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
సోయా చంక్స్ – వందగ్రాములు
మైదా – నాలుగు స్పూన్లు
ఉల్లిపాయ – ఒకటి
కొత్తిమీర – ఒక కట్ట
అల్లం తరుగు – అరస్పూను
వెల్లుల్లి తరుగు – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – అర టీ స్పూను
కారం – అర టీస్పూను
కార్న్ ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు
వెనిగర్ – ఒక టీస్పూను
డార్క్ సోయాసాస్ – ఒక టీస్పూను
గ్రీన్ చిల్లీసాస్ – ఒక టీస్పూను
టోమాటో సాస్ – ఒక టీస్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
నీళ్లు – తగినన్ని
పచ్చిమిర్చి – మూడు
స్ట్రింగ్ ఆనియన్స్ – రెండు కప్పులు
తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నీళ్లు పోసి మరగబెట్టాలి. అందులో సోయా చంక్స్ లేదా బాల్స్ వేస్తే మెత్తగా అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. వాటిని తీసి చల్లనినీళ్లలో వేసి, చల్లారగానే చేతుల్లోకి తీసుకుని వాటిలోని నీళ్లు పిండేయాలి. నీళ్లను పిండేసి సోయా చంక్స్‌ను ఒక గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలో మైదా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. కాస్త నీళ్లు కలిపి సోయా ముక్కలకు అవన్నీ బాగా పట్టేలా చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ప్రై చేసేందుకు సరిపడా నూనె వేయాలి. ఆ నూనెలో సోయా ముక్కలను విడివిడిగా వేయాలి. అవి రంగు మారే వరకు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక కళాయి పెట్టుకుని అందులో ఒక స్పూను నూనె వేయాలి. ఆ నూనెలో వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లికాడలు, ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. అందులో ఉప్పు కూడా వేసి కలపాలి. తరువాత చిల్లీసాస్, డార్క్ సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్ అన్నీ కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న సోయా బాల్స్ ను అందులో వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీర చల్లుకుని దించుకుంటే సోయా మంచూరియా రెడీ.