HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Life Style
  • >Social Anxiety Making Life Difficult Expert Advice To Help You Cope

Social Anxiety Disorder: నలుగురిలోకి వెళ్లాలంటే భయమేస్తుందా? నిపుణుల సూచనలు ఇవే!

మనలో కొంతమందికి నలుగురితో మాట్లాడడం, పబ్లిక్‌లో ఆత్మవిశ్వాసంగా ఉండటం ఒక పెద్ద సమస్యలా అనిపిస్తుంది. ఇలాంటి భయం, సంకోచం ఎక్కువై రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే, దాన్ని ‘సోషల్ యాంగ్జైటీ డిజార్డర్’ లేదా ‘సోషల్ ఫోబియా’ అని పిలుస్తారు.

  • By Kode Mohan Sai Published Date - 05:03 PM, Mon - 26 May 25
  • daily-hunt
Social Anxiety Disorder
Social Anxiety Disorder

Social Anxiety Disorder: మనలో చాలామందికి పబ్లిక్‌గా మాట్లాడడం, నలుగురిలో కలవడం భయంగా అనిపిస్తుంది. ఈ పరిస్థితిని నిపుణులు ‘సోషల్ యాంగ్జైటీ డిజార్డర్’ లేదా ‘సోషల్ ఫోబియా’ అంటున్నారు. ఇది ఎక్కువగా టీనేజ్ వయసులోనే మొదలవుతుంది. ఈ సమస్యను చిన్నగా తీసుకోవడం వల్ల, అది నెమ్మదిగా వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, ఇతర అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను ఇప్పుడే గుర్తించి పరిష్కరించుకుంటే, భవిష్యత్‌లో అనవసరమైన సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చెబుతున్నారు. మరి, అసలు ఈ ఫోబియా ఎలా వస్తుంది?

ఈ భయం ఎందుకు వస్తుంది?

నిపుణుల వివరాల ప్రకారం, కొన్ని ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి:

  • శారీరక లేదా మానసిక వేధింపులు
  • ఇంట్లో తరచూ గొడవలతో కూడిన వాతావరణం
  • వంశపారంపర్యంగా వచ్చే మానసిక సమస్యలు
  • పిల్లల్ని అతిగా కంట్రోల్ చేయడం, లేదా అత్యధిక రక్షణ కల్పించడం

ఇలాంటి పరిస్థితుల కారణంగా పిల్లల్లో నెమ్మదిగా సోషల్ భయాలు పెరుగుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ లక్షణాలు ఎక్కువగా 13 ఏళ్ల వయసు తరువాత స్పష్టంగా కనిపించడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.

సోషల్ ఫోబియా లక్షణాలు ఇవే:

సోషల్ ఫోబియాకు నిర్దిష్టమైన కారణం ఇదే అని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలను వారు వివరించారు. వాటిలో ముఖ్యమైనవి:

  • అరచేతులు, అరికాళ్లలో అనవసరంగా ఎక్కువగా చెమట పట్టడం
  • భయంతో మాటలు తడబడడం, శరీరం వణికిపోవడం
  • గుండె వేగంగా కొట్టుకోవడం
  • ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తే, వారం-పది రోజుల ముందే ఆందోళన మొదలవటం
  • ఆ సందర్భంలో నెమ్మదిగా వెనుకకి ఉండిపోవడం; ఇతరులు తనను గమనిస్తున్నారేమోనన్న భయం కలగటం
  • ఇంటర్వ్యూలకు వెళ్లలేకపోవడం, షాపింగ్‌కి భయపడటం, నలుగురితో కలిసి తినలేకపోవడం
  • పబ్లిక్ టాయిలెట్లు లేదా విశ్రాంతి గదులను కూడా ఉపయోగించడంలో సంకోచించడం

ఈ లక్షణాలు వ్యక్తి దైనందిన జీవనశైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. సాధారణ పనులు కూడా పెద్ద సమస్యలుగా అనిపిస్తాయి.

ఈ చిట్కాలతో సోషల్ ఫోబియాపై విజయం సాధించొచ్చు!

సోషల్ ఫోబియాతో బాధపడేవారిని గుర్తించి, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేక థెరపీ, కౌన్సెలింగ్‌తో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యను అధిగమించడం సాధ్యమవుతుందంటున్నారు.

మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మార్గాలు:

కెఫీన్ దూరంగా ఉంచండి:

యాంగ్జైటీని మరింత తీవ్రతరం చేసే పదార్థాలు అంటే కాఫీ, చాక్లెట్, సోడాలు వంటి వాటిని తగ్గించండి లేదా పూర్తిగా దూరంగా ఉండండి.

నిద్రలేమి సమస్యపై జాగ్రత్త:

సోషల్ ఫోబియా వల్ల కొన్ని సందర్భాల్లో నిద్రలేమి తలెత్తే ప్రమాదం ఉంది. ఇది ఆందోళనను మరింత పెంచుతుంది. అందుకే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు నిద్రకు ముందు ఉపయోగించకుండా ఉండటం, ప్రతిరోజూ కొన్ని నిమిషాలు వ్యాయామం చేయడం వంటి సాధారణ అలవాట్లతో శరీరాన్ని విశ్రాంతి పడ్డేలా చేయండి.

ధ్యానం, శ్వాస వ్యాయామాలు:

భయంగా, ఒత్తిడిగా అనిపించినప్పుడు కొంతసేపు ధ్యానం చేయడం, శ్వాస నియంత్రణ వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

సహజంగా మాట్లాడే ప్రయత్నం చేయండి:

నలుగురితో మాట్లాడే అవకాశాలను వదులుకోకుండా, మొదటుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు వంటి పరిచయాల్లో వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. దీన్ని క్రమంగా అభ్యాసంగా మార్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

నెగటివ్ ఆలోచనలపై నియంత్రణ:

తనలో తాను “నేను మాట్లాడలేను”, “ఇతరులు నన్ను తప్పుగా చూస్తారు” అనే నెగటివ్ భావనలు వచ్చినప్పుడు వాటిని ఆపేసి, సాధ్యమైనంత సానుకూలంగా ఆలోచించేందుకు ప్రయత్నించాలి.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి?

నలుగురితో కలవడాన్ని భయపడితే, జీవితంలో ఉన్న అవకాశాలన్నీ చేజారిపోతాయి. కాబట్టి ఈ ఫోబియాను చిన్నగా తీసుకోకుండా, దీన్ని ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో జయించాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • SELF CARE TIPS TO REDUCE ANXIETY
  • Social Anxiety Disorder
  • Social Phobia
  • TIPS TO GET RID OF SOCIAL ANXIETY

Related News

    Latest News

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd