Skin Care: ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!
మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ తో మాత్రమే కాకుండా సీజనల్ ఫ్రూట్స్ తో కూడా మన చర్మ సౌందర్యాన్ని మెరిసిపోయేలా చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:00 AM, Wed - 19 March 25

చర్మ సౌందర్యాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. అందంగా కనిపించడం కోసం చర్మం ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల ఫేస్ క్రీములు ఫేస్ ప్యాక్ లు బాడీ లోషన్లు వంటి ఉపయోగిస్తూ ఉంటారు. వాడితో పాటు అప్పుడప్పుడు నాచురల్ రెమెడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా సీజనల్ లో దొరికే కొన్ని సీజనల్ ఫ్రూట్స్ తో కూడా చర్మాన్ని మరిచిపోయేలా చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫ్రూట్స్ ఏంటో వాటితో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు అనగా కమలా పండు, నిమ్మ, నారింజ, జామ ఇలాంటి పండ్లు చర్మం, జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయట. విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుందట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా, శుభ్రంగా చేస్తాయని చెబుతున్నారు.
నారింజ రసం ఫేస్ ప్యాక్.. నారింజ పండ్లను ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఒక టేబుల్ స్పూన్ నారింజ రసంలో ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి బాగా అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అలాగే నారింజ తొక్కతో కూడా ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. నారింజ తొక్కను బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. దాన్ని మెత్తగా పొడిలా చేయాలి. ఒక టీ స్పూన్ నారింజ తొక్క పొడిని రెండు టీస్పూన్ల పెరుగుతో కలిపి 10 నిమిషాలు ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుందట.
తేనెతో కూడా ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు అని చెబుతున్నారు. మీకు పొడి చర్మం ఉంటే, తేనెను కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మంలో తేమను కాపాడుతుందట. అలాగే చర్మాన్ని కూడా మృదువుగా చేస్తుందట.
బొప్పాయి ఫేస్ ప్యాక్.. పూర్తిగా మాగిన బొప్పాయి పండు తొక్క తీసి ముక్కలు చేసి బాగా మెత్తగా చేసి, ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు పాటు ముఖానికి పట్టించి ఆ తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల మృత కణాలు తొలగిపోతాయట.
టమాటా, కలబంద ఫేస్ ప్యాక్.. అలాగే ఒక పండిన టమాటాను మిక్సీలో వేసి బాగా మెత్తగా చేయాలి. తరువాత దానిలో ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ లేదా ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆకును కోసి లోపలి జెల్ ను కలపాలి. ఈ మిశ్రమాన్ని15 నిమిషాలు ముఖానికి పట్టించి కడిగేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా కనబడుతుందని చెబుతున్నారు.