Saabudaana Kabab: రెస్టారెంట్ స్టైల్ సాబుదానా కబాబ్.. ఇలా చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు?
మామూలుగా మనం చికెన్ కబాబ్,మటన్ కబాబ్ ఫిష్ కబాబ్ ఇలా రకరకాల కబాబ్లు తినే ఉంటాం. అయితే ఎప్పుడు ఒకే విధమైన కబాబ్ లు కాకుండా అప్పుడప్పుడు ఏదైనా
- By Anshu Published Date - 08:12 PM, Thu - 8 February 24
మామూలుగా మనం చికెన్ కబాబ్,మటన్ కబాబ్ ఫిష్ కబాబ్ ఇలా రకరకాల కబాబ్లు తినే ఉంటాం. అయితే ఎప్పుడు ఒకే విధమైన కబాబ్ లు కాకుండా అప్పుడప్పుడు ఏదైనా కొత్తగా కూడా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైన మీరు రెస్టారెంట్ స్టైల్ లో సాబుదానా కబాబ్ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సాబుదానా కబాబ్ కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు – నాలుగు
సాబుదానా – ఒక కప్పు
పల్లీల పొడి – ఐదు టేబుల్ స్పూన్లు
పెరుగు – రెండు టీ స్పూన్లు
ఎండుమిర్చి – నాలుగైదు
ఉప్పు – తగినంత
నెయ్యి – సరిపడా
కొత్తిమీర – కొద్దిగా
రాజ్గిరా పిండి – రెండు టేబుల్ స్పూన్లు
సాబుదానా కబాబ్ తయారీ విధానం:
అయితే ఇందుకోసం ముందుగా సాబుదానా నానబెట్టుకోవాలి. తర్వాత బంగాళదుంపలను ఉడికించి, మెత్తటి గుజ్జుగా చేసుకోవాలి. పల్లీలను వేగించి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో ఉడికించిన బంగాళదుంపలు, నానబెట్టిన సాబుదాన వేసి కలపాలి. తరువాత అందులో పల్లీల పొడి, పెరుగు, దంచిన ఎండుమిర్చి, కొత్తిమీర, రాజ్గిరా పిండి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చువ్వలకు గుచ్చి గ్రిల్‌పై కాల్చాలి. కొద్దికొద్దిగా నెయ్యి అద్దుకుంటూ గోధుమ రంగులోకి మారే వరకు కాల్చాలి. అంతే ఎంతో క్రిస్పీగా ఉండే సాబుదాన కబాబ్ రెడీ.