Rice Water: బియ్యం కడిగిన నీటితో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండిలా?
ఆసియాలో రైస్ ని ఎక్కువ శాతం మంది ఉపయోగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. రైస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమంది
- By Anshu Published Date - 09:45 PM, Wed - 2 August 23

ఆసియాలో రైస్ ని ఎక్కువ శాతం మంది ఉపయోగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. రైస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమంది అన్నం ఉడికిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే గంజని కూడా తాగుతూ ఉంటారు. పూర్వం రోజుల్లో పెద్దలు ఇలా గంజిని ఎక్కువగా తాగేవారు. అయితే రైస్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రైస్ వాటర్ అందానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. రైస్ అందానికి ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రైస్ వాటర్ తయారు చేయడం చాలా సులభం. దీనికి మీకు కావలసిందల్లా బియ్యం, నీరు. అర కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి.
ఇప్పుడు అందులో రెండు కప్పుల నీరు పోసి అర గంట నానబెట్టి మళ్ళీ ఒకసారి చేత్తో మొత్తం తిప్పి ఆ నీటిని వడగట్టి ఎయిర్ టైట్ కంటెయినర్ లో పోసి ఫ్రిజ్ లో ఉంచాలి. ఈ నీరు ఫ్రిజ్ లో వారం రోజుల వరకూ నిల్వ ఉంటుంది. ఈ నీటిని ఐస్ క్యూబ్ ట్రే లో పోస్తే రైస్ వాటర్ ఐస్ క్యూబ్స్ తయారౌతాయి. అవి కూడా వారం పాటూ ఫ్రిజ్ లో ఉంటాయి. ఆ బియ్యంతో మామూలుగా అన్నం వండేసుకోవచ్చు. రైస్ వాటర్ తో ఫేస్ క్లెన్స్ చేస్తే ఫేస్ సాఫ్ట్ గా యంగ్ గా కనపడుతుంది. కొంత రైస్ వాటర్ ఒక కాటన్ పాడ్ మీద వేసి దానితో ఫేస్ అంతా మసాజ్ చేసి గాలికి ఆరనివ్వండి. ఇలా రోజూ అయినా చేయవచ్చు. టైం సరిపోదు అనుకుంటే కనీసం వారానికి రెండు సార్లైనా చేస్తే మీ స్కిన్ కి అవసరమైన విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి.
రైస్ వాటర్ అద్భుతమైన టోనర్ లా పని చేస్తుంది. కొంచెం రైస్ వాటర్ కాటన్ పాడ్ మీద వేసి దాన్ని క్లీన్ స్కిన్ మీద అప్లై చేయాలి. ఈ టోనర్ స్కిన్ ని టైటెన్ చేసి, పోర్స్ ని మినిమైజ్ చేసి, స్కిన్ ని స్మూత్ గా బ్రైట్ గా చేస్తుంది. రైస్ వాటర్ కి ఉండే సూదింగ్ ఎఫెక్ట్ వల్ల అది యాక్నే కి మంచి ట్రీట్మెంట్ లా పని చేస్తుంది. అది యాస్ట్రింజెంట్ లా కూడా వర్క్ చేసి ముఖం మీద ఎర్రదనాన్ని తగ్గిస్తుంది. ఫ్యూచర్ బ్రేకౌట్స్ ని కంట్రోల్ చేస్తుంది..ఎగ్జిమాతో వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడానికి రైస్ వాటర్ లో ఉండే స్టార్చీ క్వాలిటీస్ హెల్ప్ చేస్తాయి. రైస్ వాటర్ లో ఒక క్లీన్ వాష్ క్లాత్ ముంచి ఆ తడి క్లాత్ తో ఎఫెక్టెడ్ ఏరియా ని పాట్ చేయండి. రెండు మూడు నిమిషాలు ఇలా చేసిన తరువాత స్కిన్ ని గాలికి ఆరనివ్వండి.
కేవలం ఎగ్జిమా ఒక్కటే కాకుండా స్కిన్ ఇరిటేషన్స్ కి కూడా రైస్ వాటర్ పనికొస్తుంది. స్కిన్ బాగా దురదగా, ఇరిటేటింగ్ గా ఉన్నప్పుడు మీ బాత్ వాటర్ కి ఒకటి రెండు కప్పుల రైస్ వాటర్ యాడ్ చేసి స్నానం చేయాలి. రైస్ వాటర్ ని హెయిర్ కండిషనర్ గా కూడా వాడవచ్చు. షాంపూ చేసిన తరువాత కొన్ని చుక్కల లావెండర్ ఎస్సెన్షియల్ ఆయిల్ లేదా రోజ్ మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్ కలిపి రైస్ వాటర్ ని అప్లై చేయండి. ఒక పది నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీనికి ఫ్రిజ్ లో నుండి తీసిన దానికంటే, అప్పటికప్పుడు తీసిన రైస్ వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది.