Beauty Tips: ఏంటి అల్లంతో ముఖంపై ముడతల సమస్యలు తగ్గించుకోవచ్చా.. అదెలా అంటే?
ముఖంపై మడతలతో ఇబ్బంది పడేవారు అల్లంని ఉపయోగించి ఆ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- Author : Anshu
Date : 21-11-2024 - 2:13 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో కాలుష్య ప్రభావం అలాగే ఇతర కారణాల వల్ల ముఖంపై ముడతలు మచ్చలు వంటి చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అయితే ముఖంపై ముడతలు మచ్చలు వంటి సమస్యలను పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. ఇకపోతే ముఖంపై ముడతలు ఉంటే అల్లంతో ఆ సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం పొడి రెండు టీ స్పూన్ల తేనె కలిపిన మిశ్రమంలో తగినంత రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేసి మెత్తని పేస్టులాగా తయారు చేసుకోవాలట, తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీళ్లతో కడుక్కున్న తర్వాత ఈ పేస్ట్ అని ముఖంపై అప్లై చెయ్యాలి. 15 నిమిషాల సేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా మర్దన చేస్తూ మరక పది నిమిషాలు సేపు వదిలేయాలి. తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయట.
అల్లం లో ఉండే ఆంటీ ఏజింగ్ లక్షణాలు వలన ముఖంపై ముడతలని, ఫైన్ లైన్స్ ని తగ్గిస్తుందట. దీంతోపాటు అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఇవి మీ చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగించడంతోపాటుగా సహజమైన కాంతిని కూడా తీసుకువస్తుందని కాబట్టి ఈ రెండింటిని తప్పకుండా ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.