Bellam Sunnundalu : పిల్లలు, మహిళలకు బలాన్నిచ్చే బెల్లం సున్నుండలు.. ఇలా చేస్తే సూపర్ !
రోజుకొక బెల్లం సున్నుండ తింటే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల వెయిట్ పెరుగుతారనుకుంటే అది అపోహ మాత్రమే. రక్తహీనత సమస్య తగ్గుతుంది.
- Author : News Desk
Date : 09-06-2024 - 7:05 IST
Published By : Hashtagu Telugu Desk
Bellam Sunnundalu Recipe : సున్నుండలు.. వీటి పేరు వింటేనే నోరూరిపోతుంది కదూ. తెలుగువారి ఇళ్లలో సున్నుండలకు ఫ్యాన్స్ లేరంటే అతిశయోక్తే మరి. బెల్లంతో చేసిన సున్నుండలకు మరింత క్రేజ్ ఉంటుంది. రోజుకొక బెల్లం సున్నుండ తింటే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల వెయిట్ పెరుగుతారనుకుంటే అది అపోహ మాత్రమే. రక్తహీనత సమస్య తగ్గుతుంది. మరి బెల్లంతో సున్నుండలను తయారు చేయడానికి ఏవేం కావాలి? ఎలా తయారు చేయాలో చూద్దాం.
బెల్లం సున్నుండల తయారీకి కావలసిన పదార్థాలు
మినపప్పు – 1 కప్పు
బెల్లం తురుము – 1 కప్పు
నెయ్యి – 1/2 కప్పు
యాలకులపొడి – 1/2 స్పూన్
బెల్లం సున్నుండలు తయారీ విధానం
ముందుగా స్టవ్ పై కళాయిపెట్టి మినపప్పును చిన్న మంటపై వేయించుకోవాలి.
దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుని.. మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పొడిలో బెల్లం తురుమును వేసి 30 సెకన్లపాటు గ్రైండ్ చేసుకుని.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
గోరువెచ్చగా ఉన్న నెయ్యి, యాలకులపొడి చల్లుకుని చేతితో బాగా కలుపుతూ ఉండలుగా చుట్టుకోవాలి.
అంతే.. టేస్టీ టేస్టీ బెల్లం సున్నుండలు రెడీ.
గాలి దూరని డబ్బాల్లో బెల్లం సున్నుండలను వేసుకుని ఉంచుకుంటే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.
పిల్లలకు రోజుకొక బెల్లం సున్నుండలను పెట్టడం వల్ల శరీరానికి ఐరన్ అందడంతో పాటు రక్తహీనత సమస్య తగ్గుతుంది. మినపప్పు శరీరానికి బలాన్నిస్తుంది.
మహిళలు, పిల్లలు ఈ బెల్లం సున్నుండలను తినడం వల్ల నీరసం, అలసట వంటివి తగ్గుతాయి.
Also Read : Bird Flu: బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదకరమా..? మనిషి ప్రాణాలను తీయగలదా..?