Mosquito Bite : మీకు ఈ అలవాట్లు ఉన్నాయా ? అయితే దోమలతో ఇబ్బందే
దోమలు ఒక గుంపులో ఒకరిద్దరినే ఎక్కువ కుడుతుంటాయి. అలా ఎందుకు కరుస్తాయోనని అధ్యయనం చేయగా.. కొందరిని దోమలు అయస్కాంతాల్లా ఆకర్షిస్తాయని తెలిసిందట. మరి మిమ్మల్ని కూడా దోమలు ఎక్కువగా కుడుతున్నాయా ? అందుకు కారణాలేంటో చూద్దాం రండి.
- By News Desk Published Date - 07:44 PM, Wed - 21 August 24

Mosquito Bite : వర్షాకాలం వస్తే చాలు.. ఇంట్లో దోమలు స్వైర విహారం చేస్తుంటాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్లు, విషజ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడి.. ఆస్పత్రుల్లో చేరారు. ఇంకొంతమంది డెంగ్యూతో కష్టాలు పడుతున్నారు. అయితే.. దోమలు ఎక్కువగా ఒక గుంపులో ఒకరిద్దరినే ఎక్కువ కుడుతుంటాయి. అలా ఎందుకు కరుస్తాయోనని అధ్యయనం చేయగా.. కొందరిని దోమలు అయస్కాంతాల్లా ఆకర్షిస్తాయని తెలిసిందట. మరి మిమ్మల్ని కూడా దోమలు ఎక్కువగా కుడుతున్నాయా ? అందుకు కారణాలేంటో చూద్దాం రండి.
దోమలు ఎక్కువగా కుట్టడానికి మొదటి కారణం బ్లడ్ గ్రూప్. O బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల్ని దోమలు ఎక్కువగా కరుస్తాయని నివేదికలు చెబుతున్నాయి. O బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని దోమలు కుట్టే అవకాశం ఉంది.
ఇక రెండో రీజన్ మీ శరీర ఉష్ణోగ్రత. శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయని, ఆడ దోమలు వేడికి ఆకర్షితమవుతాయని సమాచారం. కాస్త వేడి తగిలినా దోమలు ఆ శరీరంపై వాలిపోతాయట.
మూడో కారణం.. శరీరం నుంచి వచ్చే దుర్వాసన. మీ శరీరం నుంచి వచ్చే దుర్వాసన, చెమట కారణంగా దోమలు మీపై అధికంగా వాలే అవకాశం ఉంది. ఎందుకంటే చెమట వాసనకు దోమలు ఆకర్షితమవుతాయి. బ్యాక్టీరియా కోసం అవి వస్తుంటాయి.
నాలుగో రీజన్.. ఆల్కహాల్. మీకు మందుతాగే అలవాటు ఉంటే.. దోమలకు ఆహ్వానం చెప్పినట్లే. బీర్ తాగిన తర్వాత మీ శరీరం నుంచి విడుదలయ్యే చెమటలో ఇథనాల్ ఉంటుంది. ఆ వాసన దోమల్ని ఆకర్షిస్తుంది. సో.. మీకు బీర్ తాగే అలవాటు ఎక్కువ ఉంటే.. దోమలతో కాపురం చేసినట్లే. జాగ్రత్త మరి.
పైన చెప్పిన అలవాట్లు మీకు ఉంటే.. ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండండి.
Also Read : Health Tips: నోటి దుర్వాసనను పోగొట్టే 5 పదార్థాలు..!