Life Style: ఒంటరిగా ఫీల్ అవుతున్నారా.. అయితే ఇలా చేయండి!
- Author : Hashtag U
Date : 23-06-2023 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ రోజుల్లో చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. టీనేజర్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. ఈ సమస్య ఎందుకొస్తుంది? ఒంటరితనాన్ని తగ్గించే మార్గాలేంటి? కొత్త ప్లేసుకి వెళ్లడం, స్కూల్/ కాలేజీ మారడం, తల్లిదండ్రుల మధ్య గొడవలు, విడిపోవడం, స్నేహితులు లేదా దగ్గరివాళ్లను కోల్పోవడం, ఫ్రెండ్స్ అవాయిడ్ చేయడం, బెదిరింపులకు గురికావడం.. ఇలా స్కూల్ లేదా ఇంట్లో ఉండే పరిస్థితులు, బయట ఎదుర్కొనే రకరకాల సంఘటనల వల్ల కొన్నిసార్లు పిల్లలు, యువత ఒంటరితనానికి అలవాటు కావొచ్చు.
టీనేజ్ లో ఒంటరితనాన్ని అనుభవించడం వల్ల పిల్లలు మానసికంగా మరింత వీక్ అయ్యే అవకాశముంది. ఏ కారణంగా ఒంటరిగా అనిపిస్తుందో దాన్ని గుర్తించి సరి చేసుకోవాలి. పిల్లలు సైలెంట్ గా, ఒంటరిగా ఉంటున్నట్టు గమనిస్తే పేరెంట్స్ దానికి గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఫీలయ్యే వాళ్లు అదే పనిగా ఖాళీగా ఉండకూడదు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమైపోవడం వల్ల లోన్లీనెస్ ఫీలింగ్ తగ్గుతుంది. మనసు ఆలోచనల్లో బిజీగా ఉంటుంది.
ఒంటరిగా ఫీలయ్యే వాళ్లు ఆటలు ఆడడం, పుస్తకాలు చదవడం, పెయింటింగ్, గార్డెనింగ్, వంటలు చేయడం లాంటి కొత్త అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా ఒంటరితనం నుంచి బయటపడొచ్చు. ఒంటరిగా ఫీలయ్యే వాళ్లు వీలైనంత వరకూ మనుషులతో కలిసి ఉండడానికి ట్రై చేయాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపడం ద్వారా లోన్లీనెస్ ఫీలింగ్ తగ్గుతుంది. ఒంటరితనంతో బాధపడుతున్నవాళ్లు ఇంట్లో కంటే బయటే ఎక్కువ సమయం ఉండాలి. ఇంట్లో ఎక్కువ వెళుతురు, వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
Also Read: KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!