HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Life Style
  • >Not Only Biryani These Are Delicious

Hyderabad: బిర్యానీయే కాదు.. ఇవీ మ‌స్తుంట‌య్‌..!

హైదరాబాద్​ పేరు చెప్పి ఇక్కడ దొరికే ఫేమస్​ ఫుడ్​ ఐటమ్​ పేరు చెప్పమని అడిగితే అందరూ టక్కున చెప్పేది హైదరాబాదీ దమ్​కా బిర్యానీయే.

  • By Gopichand Published Date - 08:30 AM, Mon - 14 November 22
  • daily-hunt
Biryani
Biryani Imresizer

హైదరాబాద్​ పేరు చెప్పి ఇక్కడ దొరికే ఫేమస్​ ఫుడ్​ ఐటమ్​ పేరు చెప్పమని అడిగితే అందరూ టక్కున చెప్పేది హైదరాబాదీ దమ్​కా బిర్యానీయే. అంతలా ప్రేమిస్తారు మనోళ్లు దమ్​ బిర్యానీని. చుట్టాలొస్తే బిర్యానీ, దోస్తులు కలిస్తే బిర్యానీ, రోజూ తినే వంట బోర్​ కొడితే బిర్యానీ. బిర్యానీని మించిన రుచిని ఎందులోనూ వెతుక్కోవడానికి ఇష్టపడం. అయితే హైదరాబాద్​లో బిర్యానీతో పాటు కొన్ని రకాల ఫుడ్​ ఐటమ్స్​ ఫేమస్​. మన లైఫ్ స్టైల్ జీవితంలో ఇవి లేనివి రోజు గడవదు. అయితే బిర్యానీతో సమానంగా మనలను నోరూరించి గౌరవించే ఆ ఫుడ్​ ఐటమ్స్​ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..!

ఇరానీ చాయ్​, సమోసా

పొద్దున్నే టిఫిన్‌ చేయగానే ఒక కప్పు ఇరానీ చాయ్​ తాగితే ఆ రోజుకు కావాల్సిన ఎనర్జీ అంతా బాడీలో ఒదిగిపోతుంది. ఇరానీ చాయ్​ పుట్టింది ఇరాన్​లో అయినా మన దగ్గర ఉన్నంత డిమాండ్​ అక్కడ ఉండదేమో. హైదరాబాద్​లో ఎక్కడ చూసినా ఈ చాయ్​ ఘుమఘుమలే. రెండు సమోసాలు తిని ఒక్క కప్పు ఇరానీ చాయ్​ తాగితే ఆ మజా మాటల్లో చెప్పలేం. సమోసా ప్లేస్​లో ఉస్మానియా బిస్కెట్లు తింటే అదో రకమైన రుచి. దేని రుచి దానిదే.

హైదరాబాదీ చాట్​

వేడి వేడి సూపులో.. ఉడకబెట్టిన శెనగ బఠాణీలు వేసి అంచుకు ఉల్లిగడ్డ వేసుకొని గుటుక్కున మింగే పానీపూరి టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్​లో పానీపూరీలో చాలావరకు ఉడికించిన శెనగలే వాడతారు. కానీ.. కొన్నిప్రాంతాల్లో ఉడికించిన ఆలూపేస్ట్​ని పానీపూరిలో పెట్టి ఇస్తారు. ఆర్డర్​ ఇచ్చిన పానీపూరీ తిన్న తర్వాత లాస్ట్​లో ఒక కాంప్లిమెంటరీ పానీపూరి తినకపోతే.. మన ఆత్మ శాంతించదు. కదా.. అందులోనే అసలు పానీపూరీ రుచి దాగుందేమో అనిపిస్తుంది. హైదరాబాద్​లో దొరికే పానీపూరీలో మసాలా పూరీ, పానీ పూరీ, రగడా పూరీ ఇలా చాలా రకాలుంటాయి. జూబ్లీహిల్స్​లోని మహారాజా చాట్​, బర్కత్​పురాలోని మయూర్​ పాన్​షాప్​, గచ్చిబౌలిలోని సర్దార్జీ దాబా, కోఠీలోని గోకుల్​ చాట్ వంటి చాట్​సెంటర్లలో దొరికే పానీపూరీ రుచి వేరే ప్రాంతాల్లో దొరకదు.

పాయా, నాన్​

ఇది హైదరాబాదీలు ఇష్టంగా తినే బ్రేక్​ఫాస్ట్​ ఐటమ్​. రుచికి రుచి.. బలానికి బలం దీని స్పెషాలిటీ. మటన్​ పాయాకు మసాలా రుచి తగిలించి నాన్​ కి రోటీతో కలిపి లాగిస్తుంటే.మసాలా ఘాటు నషాలానికంటుతుంటే.. రుచి పుర్రెకు తగులుతది. గోధుమ పిండి, మైదాపిండితో చేసే నాన్​ కి రోటీ కండపుష్టికి ఉపయోగపడితే.. మటన్ బొక్కలతో మరిగించిన పాయా ఎముక పుష్టికి సహాయపడుతుంది. ఇక మసాలా దినుసులు.. దగ్గు, కఫం, జలుబు, తలనొప్పి, ఒత్తిడి, మగత వంటి వాటిని మటుమాయం చేస్తుంది.

దోశ‌, ఇడ్లీ

ఇవి కూడా హైదారాబాద్​లో స్పెషలేంటి? ఎక్కడైనా దొరుకుతాయి కదా అని ఆశ్చర్యపోకండి. స్పెషాలిటీ లేనిదే.. దాని గురించి ప్రస్తావన రాదు కదా. చెన్నై, విజయవాడ, గుంటూరులో దొరికే ఇడ్లీ, దోశ రుచి వేరు. హైదరాబాద్​లో దొరికే దోశ, ఇడ్లీ రుచి వేరు. ఇక్కడ దొరికే దోశ, ఇడ్లీలో నెయ్యి, మసాలా, బటర్​, చీజ్​లతో పాటు కస్టమర్ల మీద ప్రేమ, పనిలో ఉన్న అనుభవం కూడా కలుపుతారు. అందుకే ఇక్కడ దొరికే దోశ, ఇడ్లీ ఫేమస్​ అయ్యాయి. బిర్యానీతో సమానంగా రుచిని అందించే జాబితాలో చోటు సంపాదించాయి.

బర్గర్

ఈ పేరు చెప్పగానే అందరికీ మెక్​ డొనాల్డ్​ బర్గర్లు గుర్తుకొస్తాయి. కానీ హైదరాబాద్​లో దొరికే బర్గర్లు అలాంటివి కాదు. ఆ బర్గర్లకు, ఈ బర్గర్లకు తేడా ఉంటుంది. చేత్తో తయారుచేసిన హైదరాబాదీ బర్గర్లు ఇవి. టొమాటో కెచప్​, మయో, బాగా వేయించిన ఆలూ చిప్స్​ కలిపి ఈ బర్గర్లు తయారుచేస్తారు. హైదరాబాదీ బేకరీల్లో దొరికే బర్గర్లకు, మెక్​ డొనాల్డ్​ వాళ్లు అమ్మే బర్గర్లకు నత్తకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది రుచిలో. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, టొమాటో, చీజ్​ కలిపి హైదరాబాద్​ బేకరీల్లో దొరికే వెజ్​, నాన్​వెజ్​ బర్గర్లు ఇక్కడి ప్రత్యేకం. సిటీలోని చాలా బేకరీల్లో హైదరాబాదీ బర్గర్లు దొరుకుతాయి. ధర తక్కువ. రుచి ఎక్కువ.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • biryani
  • dosa
  • hyderabad biryani
  • idli
  • irani chai
  • samosa

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd