Unwanted Hair: ఫేస్ పై అన్‌వాంటెడ్ హెయిర్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని ట్రై చేయాల్సిందే?
మామూలుగా మహిళలు అందానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వాటిలో అన్‌వాంటెడ్ హెయిర్ సమస్య కూడా ఒకటి. వీటినే అవాం
- By Anshu Published Date - 07:10 PM, Fri - 1 December 23

మామూలుగా మహిళలు అందానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వాటిలో అన్‌వాంటెడ్ హెయిర్ సమస్య కూడా ఒకటి. వీటినే అవాంఛిత రోమాలు అని కూడా అంటూ ఉంటారు. ఇది కాళ్లు చేతులు కొంతమందికి ముఖ భాగంలో కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాళ్ల చేతులు భాగంలో ఈ అన్‌వాంటెడ్ హెయిర్ పేరు వచ్చిన పెద్దగా పట్టించుకోకపోయినప్పటికి ముఖంపై వస్తే మాత్రం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటారు. వీటిని రిమూవ్ చేయడం కోసం చాలామంది లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉంటారు.
అయితే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని సింపుల్ టిప్స్ ని పాటించడం వల్ల ఈ అన్ వాంటెడ్ హెయిర్ సమస్య నుంచి బయటపడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఓట్స్ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేస్తాయి. ఇది స్కిన్ ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంతో పాటుగా మురికిని కూడా తొలగిస్తుంది. పండ్లలోని అనేక భాగాలు చర్మ సంరక్షణకు చాలా ముఖ్యమైనవి. అందుకోసం ఓట్స్ ని 2 టేబుల్ స్పూన్ల పరిమాణంలో తీసుకుని పొడి చేయాలి. ఇందులో అరటిపండుని కలిపి గుజ్జులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసిన ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కోడిగుడ్డులో తెల్లసొన, బియ్యంపిండి చర్మ సంరక్షణకు చాలా మంచిది. ఒక చిన్న గిన్నెల్లో గుడ్డుని తీసుకొని అందులో తెల్లసొన తీసి అందులోని బియ్యంపిండిని కలపాలి. పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. అదేవిధంగా అవాంఛిత రోమాలు దూరం చేయడంలో నిమ్మ బాగా హెల్ప్ చేస్తుంది. ముందుగా రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, నిమ్మరసం బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సుమారు మూడు నిమిషాలు వేడి చేసి కొద్దిగా నీరు పోసి కలపాలి. ఇది మందంగా ఉంటే మరింత నీరు పోసి వ్యాక్స్‌లా చేయాలి. దీనిని గోరువెచ్చగా ఉన్నప్పుడే ముఖానికి అప్లై చేయాలి వాక్సింగ్ స్ట్రిప్స్ దానిపై పెట్టి ప్రెస్ చేసి ఒకేసారి లాగాలి. ఇది జుట్టు పెరిగే దానికి అపోజిట్ డైరెక్షన్‌లో చేయాలి. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జుని తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి పేస్టులా చేసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి, ఆ తర్వాత నీటితో క్లీన్ చేయాలి.