Mutton Haleem: ఎంతో స్పైసీగా ఉండే మటన్ హలీం సింపుల్ గా ఇంట్లోనే ఇలా చేసుకోండి?
మామూలుగా మనం మటన్ తో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. మటన్ బిర్యానీ, మటన్ మసాలా కర్రీ, మటన్ వేపుడు, మటన్ కర్రీ ఇలా ఎన్నో రకాల వంటకాలు ట్రై చే
- By Anshu Published Date - 09:20 PM, Sun - 4 February 24

మామూలుగా మనం మటన్ తో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. మటన్ బిర్యానీ, మటన్ మసాలా కర్రీ, మటన్ వేపుడు, మటన్ కర్రీ ఇలా ఎన్నో రకాల వంటకాలు ట్రై చేసి ఉంటాం. అయితే ఎప్పుడైనా మటన్ హలీమ్ ని తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మటన్ హలీంకు కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ మటన్ – 600గ్రా
లావు గోధుమ రవ్వ – 300గ్రా
సెనగపప్పు – 50గ్రా
బియ్యం – 50గ్రా
నూనె – 300ఎంఎల్
నెయ్యి – 300ఎంఎల్
కారం – 50గ్రా
పసుపు – 50గ్రా
పచ్చిమిర్చి – 30గ్రా
అల్లం వెల్లుల్లి పేస్టు – 30గ్రా
మిరియాల పొడి – 10గ్రా
నిమ్మకాయలు – మూడు
యాలకులు – 50గ్రా
గరం మసాలా – 50గ్రా
ఉల్లిపాయలు – 200గ్రా
పెరుగు – 100గ్రా
పుదీనా – 50గ్రా
తమలపాకు వేర్లు – 30గ్రా
ఖాస్ కి జాద్ – 30గ్రా
మటన్ హాలీం తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో ఖాస్ కి జాద్, పాన్ కి జాద్ వేసి, తగినన్ని నీళ్లు పోసి 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించాలి. గోధుమరవ్వ, సెనగపప్పు, బియ్యంను అరగంటపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు తీసేసి మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. స్టవ్‌పై మందంగా ఉండే పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. ఇందులో నుంచి గార్నిష్ కోసం కొన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పెరుగు, పసుపు, కారం, గోధుమరవ్వ-సెనగపప్పు-బియ్యం పేస్టు వేసి కలపాలి. ఈ మిశ్రమం వేగిన తరువాత మటన్ వేయాలి. మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలియబెట్టాలి. నిమ్మరసం, మిరియాల పొడి, యాలకులపొడి, గరంమసాలా వేయాలి. పైన నెయ్యి వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ హలీం రెడీ.