Mutton Dalcha : మటన్ దాల్చాను ఇలా చేయండి.. టేస్ట్ సూపర్ అంతే..
రంజాన్ నెలలో ఇంకా ఎక్కువగా చేస్తారు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నం, రోటీ, చపాతీ వంటి వాటిలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే..
- By News Desk Published Date - 10:41 PM, Thu - 16 November 23

Mutton Dalcha : మటన్ దాల్చా.. ఈ వంటకాన్ని ముస్లింలు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. రంజాన్ నెలలో ఇంకా ఎక్కువగా చేస్తారు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నం, రోటీ, చపాతీ వంటి వాటిలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే.. మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు. ఈ వంటకాన్ని తయారు చేయడం చాలా సులభం. అసలు దీనిని చేయడం రానివారు కూడా మటన్ దాల్చాను సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావలసిన పదార్థాలేంటో.. తయారీ విధానమేంటో తెలుసుకుందాం.
మటన్ దాల్చా తయారీకి కావలసిన పదార్థాలు
నూనె – 2 టేబుల్ స్పూన్స్
లవంగాలు – 5
యాలకులు -2
బిర్యానీ ఆకు – 1
దాల్చిన చెక్క – 1 ఇంచు ముక్క
పొడవుగా తరిగిన ఉల్లిపాయ -1
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1టేబుల్ స్పూన్
అరగంట ఉప్పునీటిలో నానబెట్టిన లేత మటన్ – 300 గ్రాములు
ఉప్పు – రుచికి తగినంత
పసుపు – అర టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
నీళ్లు – 750 ఎంఎల్
1 గంట నానబెట్టిన కందిపప్పు – అరకప్పు
నానబెట్టిన శనగపప్పు – అరకప్పు
తాలింపు తయారీకి కావలసిన పదార్థాలు
నూనె – పావుకప్పు
జీలకర్ర – అర టీ స్పూన్
ఆవాలు – అర టీ స్పూన్
తరిగిన ఉల్లిపాయ – 1
లేత సొరకాయ ముక్కలు – 1 కప్పు
తరిగిన పచ్చిమిర్చి -6
కరివేపాకు – 2 రెమ్మలు
ఉప్పు – తగినంత
కారం – 1 టీ స్పూన్
జీలకర్రపొడి – 1 టీ స్పూన్
నానబెట్టిన చింతపండు – 50 ఎంఎల్
మటన్ దాల్చా తయారీ విధానం
ఒక కుక్కర్ ను స్టవ్ పై పెట్టి.. అందులో నూనె వేసి వేడిచేయాలి. ఇప్పుడు అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు మటన్ ముక్కలు వేసి పెద్దమంటపై 3 నిమిషాలు ఉడికించి.. ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. మరో 2 నిమిషాలు ఉడికిన తర్వాత నీళ్లుపోసి కలపాలి. కుక్కర్ మూత పెట్టు.. 5 లేదా 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ ఆరిన తర్వాత.. అందులో కందిపప్పు, శనగపప్పు వేసి 100 ఎంఎల్ నీరు పోసి మరో 3 విజిల్స్ వచ్చేవరకూ ఉంచాలి. మటన్ ముక్క నలగకుండా పప్పునుమాత్రం విస్కర్ తో మెత్తగా చేసుకోవాలి.
కళాయిలో నూనె వేసి వేడిచేసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్రపొడి వేసి రెండు నిమిషాలపాటు వేయించాలి. తర్వాత చింతపండు రసం 100 ఎంఎల్ పోసి నాలుగు నిమిషాలు పెద్దమంటపై మరిగించి. పప్పువేసి కలుపుకోవాలి.100 ఎంఎల్ నీరుపోసి మరోసారి మధ్యస్థ మంటపై 12 నిమిషాలపాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే మటన్ దాల్చా రెడీ. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుని అన్నంలేదా చపాతీల్లో తింటే.. అస్సలు వదిలిపెట్టరు.
Related News

Egg Alternatives : గుడ్డుకు ఆల్టర్నేటివ్ ఈ ఫుడ్స్
Egg Alternatives : గుడ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. వాటిని తింటే ఆరోగ్యానికి మంచిది.