Fenugreek: పాలలో మెంతిపోడి కలిపి తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటీ?
కిచెన్ లో దొరికే వాటిలో మెంతులు కూడా ఒకటి. ఈ మెంతులను చాలామంది వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెంతి గింజల లలో ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటాయి.
- By Anshu Published Date - 09:30 AM, Sun - 18 September 22

కిచెన్ లో దొరికే వాటిలో మెంతులు కూడా ఒకటి. ఈ మెంతులను చాలామంది వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెంతి గింజల లలో ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటాయి. అయితే మెంతులను ఆహారంలో తరచుగా ఉపయోగించడం వల్ల ఆహారానికి రుచి రావడంతో పాటు శరీరంలో అనేక సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మెంతులు వంటకాల రుచిని పెంచడంతో పాటుగా మధుమేహానికి కూడా నియంత్రించగలవు. మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
చర్మ సౌందర్యానికి అలాగే జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్, కాల్షియం,ఐరన్,ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ,సి కె,బి, రాగి,జింక్, ఫైబర్,అధికార పోషకాలు ఉంటాయి. అయితే ఈ మెంతులతో చేసిన మెంతి పొడిని పాలలో వేసుకొని తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మెంతి పొడిని రెండు స్పూన్ లను తీసుకొని పాలల్లో వేసుకుని కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల నీరసం, ఒత్తిడి వంటి సమస్యలు దరిచేరవు. కాబట్టి ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు, లేదంటే ఒత్తిడి కలిగినప్పుడు పాలలో రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడిని కలుపుకొని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.