HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Keep These Things In Mind Before Buying A Sofa Or Sofa Set For Your Home

Sofa Set: మీ ఇంట్లో సోఫా లేదా సోఫా సెట్ కొనేముందు వీటిని దృష్టిలో ఉంచుకోండి!

సోఫా లివింగ్‌ రూమ్‌ లూక్‌ మార్చేస్తుంది. ఒకసారి సోఫాపై ఇన్వెస్ట్‌ చేస్తే.. ఏళ్ల తరబడి మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది. సోఫా కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు

  • Author : Maheswara Rao Nadella Date : 08-03-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sofa Clean
Sofa Clean

సోఫా (Sofa) కొనడం అంటే మీరు మీ ఇంటి కోసం చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడులలో ఒకటి అనే చెప్పాలి. లివింగ్‌ రూమ్‌లో విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదవడానికి, ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టడానికి, బెస్ట్‌ ప్లేస్‌ అంటే సోఫానే. సోఫాలో హాయిగా కూర్చొని టీవీ చూస్తుంటే.. వచ్చే ఫీలింగే వేరు. ఒకసారి సోఫాపై ఇన్వెస్ట్‌ చేస్తే.. ఏళ్ల తరబడి మన ఆనంద క్షణాలను దానిపై గడుపుతాం. మధ్యతరగతి కుటుంబాలలో సోఫాను ఏళ్లతరబడి వాడుతూనే ఉంటారు. సోఫాలు చిరిగిపోయి, విరిగిపోయే వరకు మార్చరు. అందుకే, వాటిని కొనేప్పుడు సౌకర్యవంతంగా, మన్నికైనదిగా, మన లైఫ్‌స్టైల్‌కు సరిపోయే విధంగా ఎంచుకోవాలి. సోఫా (Sofa) కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కొత్త సోఫా కొనే ముందు పరిగణలోకి తీసుకోవలసిన విషయాల గురించి ఈ స్టోరీలో చూసేద్దాం.

రూమ్‌ కొలతలు తీసుకోండి:

సోఫా కొనడానికి.. షాప్‌కు వెళ్లే ముందు, గదిని కొలతలు తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది కొలతలు తీసుకోకుండా.. గదికంటే పెద్దది లేదా చిన్న సోఫా కొంటూ ఉంటారు. దీనివల్ల గది అందం పాడవుతుంది. గది కొలతలు తీసుకుంటే.. సోఫా ఎలా ఎరేంజ్‌ చెయ్యాలి, మిగిలిన వస్తువులు ఎలా సర్దాలి అనే ఐడియా ఉంటుంది. అలాగే, ఏ ప్రవేశ ద్వారం నుంచి సోఫా తీసుకువెళ్తున్నారో దాని కొలతలు కూడా తీసుకుంటే మంచిది. దీనివల్ల సోఫా డెలివరీలో ఇబ్బందులు ఉండవు.

గదికి తగ్గ రంగు ఎంచుకోండి:

సోఫా లివింగ్‌ రూమ్‌కు కొత్తు లుక్‌ తీసుకొస్తుంది. కానీ, మీరు సోఫా కొన్నప్పుడు దాని రంగుపై శ్రద్ధ చూపకపోతే.. మొత్తం గది అందం పాడవుతుంది. మీరు రూమ్‌ కలర్‌కు తగ్గట్టు సోఫా కలర్‌ ఎంచుకోండి. షోరూమ్‌లో కనిపించే సోఫా మీ ఇంటి సెట్టింగ్‌లో పూర్తిగా భిన్నంగా కనిపించవచ్చు.

మంచి ఫ్యాబ్రిక్‌‌ చూసి కొనండి:

సోఫా కొనుగోలు చేసేటప్పుడు ఫాబ్రిక్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఇంటీరియర్‌ డెకరేటర్స్‌ సూచస్తున్నారు. ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలు, పెట్స్‌ ఉంటే.. క్లీనింగ్‌ ఫ్లెండ్లీ ఫాబ్రిక్‌ ఎంచుకోవడం మంచిది. సోఫా ఫాబ్రిక్‌ మీ లైఫ్‌స్టైల్‌, కుటుంబ సభ్యుల అవసరాలుకు అనుగుణంగా ఉండాలని గుర్తుంచుకోండి. కాటన్, లినెన్, లెదర్ సోఫాలు.. ఇంటికి క్లాసిక్‌ లుక్‌ తీసుకువస్తాయి. మైక్రోఫైబర్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌లు మన్నికగా ఉంటాయి, శుభ్రం చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి.

దృఢమైన ఫ్రేమ్‌ను ఎంచుకోండి:

బట్టీలో ఎండబెట్టిన ఓక్, బీచ్, టేకు చెక్కలు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ఇవి కాస్ట్‌ ఎక్కువగా ఉన్నా.. బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అని చెప్పాలి. పైన్‌ చెక్క మృదువుగా ఉంటుంది, దీనితో తయారు చేసిన సోఫాలు ఎక్కువ కాలం మన్నవు. పార్టికల్‌బోర్డ్, ప్లాస్టిక్, మెటల్‌ సోఫాలు కొనొద్దు. వీటిలో పగుళ్లు అసౌకర్యంగా ఉంటాయి.

Also Read:  Moon: మన చంద్రుడికి ఒక టైం జోన్.. సన్నాహాలు వేగవంతం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • buying
  • home
  • Life Style
  • Mind
  • sofa
  • Sofa Set
  • Thing
  • tips
  • Tricks

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd