Kaju Chicken Fry: ఎంతో రుచిగా ఉండే కాజు చికెన్ ఫ్రై.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
- By Nakshatra Published Date - 08:00 PM, Wed - 2 August 23
మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. చికెన్ కబాబ్, చికెన్ బిర్యాని, తందూరి చికెన్, చికెన్ కర్రీ, లెగ్ పీస్ , చికెన్ 65 ఇలా చికెన్ తో ఎన్నో రకాల వంటకాలను తిని ఉంటాం. అయితే ఎప్పుడైన కాజు చికెన్ ఫ్రై ట్రై చేశారా. మరి ఎంతో రుచిగా ఉండే కాజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాజు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్ధాలు:
చికెన్ – ఒక కేజీ
పసుపు – అర టీస్పూన్
ఉప్పు – సరిపడా
అల్లం వెల్లులి పేస్ట్ – అర టేబుల్ స్పూన్
నీరు – ముప్పావు కప్పు
ధనియాలు – రెండు టేబుల్ స్పూన్స్
జీలకర్ర – ఒక టీస్పూన్
మిరియాలు – ఒక టీస్పూన్
యాలకులు – నాలుగు
లవంగాలు – ఏడు
కొబ్బరి పొడి – పావు కప్పు
గసగసాలు – ఒక టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క – రెండు
నూనె – అర కప్పు
కరివేపాకు – నాలుగు రెబ్బలు
అల్లం వెల్లులి పేస్ట్ – అర టేబుల్ స్పూన్
జీడిపప్పు – పావు కప్పు
కారం – 1 1/4 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
కాజు చికెన్ ఫ్రై తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా చికెన్ లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తరువాత మసాలా పొడి కోసం తీసుకున్న పదార్థాలన్నీ సన్నని సెగపై మంచి సువాసన వచ్చేవరకు వేపుకుంటూ చివర్లో కొబ్బరి పొడి, గసగసాలు కూడా వేసి వేపుకోవాలి. అవి చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి. చికెన్ లో నీరు పోసి కుక్కర్ మూతపెట్టి, హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి ఆవిరిని పోనివ్వాలి. నూనె వేడి చేసి, జీడిపప్పుని ఎర్రగా వేపి పక్కన పెట్టుకొని, మిగిలిన నూనెలో కరివేపాకు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి. తర్వాత ఉడికిన చికెన్‌ని నీరుతో సహా పోసి మీడియం ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. సుమారుగా 20 నిమిషాలకి చికెన్ ముక్క రంగు మారుతుంది. అప్పుడు ఉప్పు, కారం, వేపుకున్న మసాలా పొడితో పాటు వేపుకున్న జీడిపప్పు వేసి కలిపి ఇంకో రెండు నిమిషాలు వేపి దింపేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కాజు చికెన్ ఫ్రై రెడీ.
Related News
Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్‌వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్ర�