Jackfruit Masala Curry: పనసకాయ మసాలా కుర్మా.. ఇలా చేస్తే లొట్టలు వేసుకుని తినేయాల్సిందే?
మామూలుగా పనసకాయ తో తయారు చేసే రెసిపీలను మనం చాలా తక్కువగా తినే ఉంటాం. పనసకాయలు మామూలుగా తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటా
- Author : Anshu
Date : 08-12-2023 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా పనసకాయ తో తయారు చేసే రెసిపీలను మనం చాలా తక్కువగా తినే ఉంటాం. పనసకాయలు మామూలుగా తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొందరు ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కాస్త వెరైటీగా ఉండాలని పనసకాయలతో డిఫరెంట్ గా కూరలు చేసుకుని తింటూ ఉంటారు. అటువంటి వాటిలో పనసకాయ మసాలా కుర్మా కూడా ఒకటి. మరి ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఈ పనసకాయ మసాలా కుర్మా ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పనసకాయ మసాలా కుర్మా కావలసిన పదార్థాలు:
పనసకాయ ముక్కలు – 3 కప్పులు
చింతపండు – సరిపడా
అల్లం,వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్స్
ఉల్లిముద్ద – 1 కప్పు
ఉల్లిపాయల ముక్కలు – 1కప్పు
గరం మసాలా – 2 స్పూన్స్
పొడి కారం – 2స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడినంత
పసుపు – చిటికెడు
జీడిపప్పు – 50గ్రాములు
కొత్తిమీర – కొంచంగా
పోపు దినుసులు – తగినన్ని
నూనె – 150గ్రాములు
పనసకాయ మసాలా కుర్మా తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా పనసకాయ ముక్కల్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పనసకాయ ముక్కల్ని చింతపండు రసం,ఉప్పు,పసుపు వేసి 20 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి పోపు దినుసులు వేసుకొని అవి వేగాకా జీడి పప్పు,ఉల్లి ముక్కలు వేసి అవి కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు,ఉల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించాలి. ఇప్పుడు అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న పనస ముక్కల్ని వేసి గరం మసాల పొడి,కారం వేసి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ మసాలా కుర్మా రెడీ.