Lizard : శరీరం పై బల్లి పడటం మంచిది కాదా? అరిష్టమా?
శాస్త్ర ప్రకారం బల్లి (lizard) శరీరంపై పడితే ఏం జరుగుతుంది? అలా పడటం మంచిది కాదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Naresh Kumar Published Date - 06:40 PM, Mon - 4 December 23

మామూలుగా మనుషులు జీవించే ఇళ్లలో కొన్ని రకాల జీవులు కూడా నివసిస్తూ ఉంటాయి. వాటిని ఇంట్లో పెంచుకోకపోయినప్పటికీ వాటతంట అవే వస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో బల్లి (lizard) కూడా ఒకటి. మామూలుగా ప్రతి ఒక్కరి ఇళ్లలో బల్లులు ఉండడం అన్నది సహజం. వాటిని కొంతమంది చంపడం బయటకు విసిరి పారేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఏదో ఒక విధంగా బల్లులు మళ్ళీ ఇంట్లోకి చొరబడుతూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా బల్లులు తలపై శరీర భాగాలపై ఇలా పడుతూ ఉంటాయి. ఇలా పడినప్పుడు చాలామంది ఆశుభంగా, దురదృష్టంగా భావిస్తారు. శాస్త్ర ప్రకారం బల్లి (lizard) శరీరంపై పడితే ఏం జరుగుతుంది? అలా పడటం మంచిది కాదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
కాగా శకున శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తిపై బల్లి (lizard) పడితే అది శుభసూచకంగా పరిగణిస్తారు. హిందూ నమ్మకాల ప్రకారం, శరీరంపై బల్లి పడితే ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలా బల్లి పడిన వ్యక్తి తన జీవితంలో డబ్బు పొందుతాడని అర్థం. అయితే బల్లి పడటం అన్నది శుభసూచకమే కాదు శరీరం పై బల్లి పడటం వల్ల ఆ వ్యక్తికి సమాజంలో ఎంతో గౌరవం కూడా లభిస్తుందట. అలాంటి వ్యక్తి పట్ల గౌరవం రోజు రోజుకూ పెరుగుతుందట. అయితే కొంతమంది మాత్రం బల్లి పడటం అస్సలు మంచిది కాదని దురదృష్టం అని, అపశకునం అని, అశుభం అని ఏవేవో మాట్లాడుతూ నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. అలా అనుకోవడం భ్రమ మాత్రమే. అలాగే శకున శాస్త్ర ప్రకారం పురుషుల చేతులపై బల్లి పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒక వ్యక్తి ఎడమ చేతిపై బల్లి పడితే, ఆ వ్యక్తి ఆస్తి నష్టాన్ని చవిచూడవచ్చు లేదా ఆ వ్యక్తి ఆస్తిని మరొకరు స్వాధీనం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి కుడిచేతి పై బల్లి పడితే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది అకస్మాత్తుగా డబ్బు రావడానికి సంకేతం. ఈ వ్యక్తి తన జీవితంలో అకస్మాత్తుగా చాలా డబ్బు, సంపదను పొందుతాడని అర్థం.. ఒకవేళ స్త్రీ ఎడమ చేతిపై బల్లి పడితే అది అశుభ సంకేతం. ఫలితంగా ఆమె తన ధనాన్ని కోల్పోయే సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మరోవైపు, స్త్రీ కుడి చేతిపై బల్లి పడితే, అది శుభ సంకేతంగా పరిగణిస్తారు. కుడిచేతిపై బల్లి పడటం లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. వారు వ్యాపారంలో చాలా లాభాలను పొందుతారని చెప్పేందుకు ఇది సంకేతంగా భావించాలి.
Also Read: Grey Hair: నెయ్యిలో వీటిని కలిపి రాస్తే చాలు తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే?