Curd: స్కిన్ మెరవాల.. అయితే పెరుగుతో ఇలా చేయాల్సిందే?
పెరుగు వల్ల ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. మరి ముఖ్యంగా వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయో
- By Nakshatra Published Date - 09:20 PM, Wed - 21 June 23
పెరుగు వల్ల ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. మరి ముఖ్యంగా వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పెరుగు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి చర్మ సౌందర్యానికి పెరుగు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శనగపిండి: శనగపిండి వల్ల మెరిసే ముఖం మీ సొంతమవుతుంది. అందుకోసం శనగపిండిలో కొద్దిగా పెరుగు వేసి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి.
పెరుగు, నిమ్మరసం: పెరుగు, నిమ్మరసం రెండు అందానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పెరుగులో కాస్తా నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ తర్వాత కాటన్ ప్యాడ్‌ని వేసి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాయాలి. దీనిని స్కిన్‌కి రాయడం వల్ల పోషకాలు తిరిగి అంది ఇది చర్మ పీహెచ్ బ్యాలెన్స్‌కి కూడా చాలా మంచిది.
పెరుగు, తేనె: ఓ టీ స్పూన్ పెరుగులో టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. దీన్ని పేస్టులా చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి.
పెరుగు, ఓట్స్ : ఒక గిన్నెలో కొంచెం పెరుగు, ఓట్స్ తీసుకొని రెండింటిని బాగా కలిపి ముఖం, బాడీకి అప్లై చేయండి. ఈ పేస్టుతో ముఖాన్ని, బాడీని స్క్రబ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవడం వల్ల స్క్రబ్ మృతకణాలను తొలగించి అడ్డుపడే రంధ్రాలను అన్‌క్లాగ్ చేస్తుంది.
Related News
Diabetic : పెరుగును ఇలా తింటే మధుమేహం తగ్గుతుంది
కొందరికి పెరుగు లేకుంటే భోజనం పూర్తికాదు. పెరుగు తింటే లావు అవుతుందనే అపోహ కొంతమందిలో ఉంటుంది.