Miss World 2024 : ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా గొప్ప పనులు.. తెలుసా ?
Miss World 2024 : చెక్ రిపబ్లిక్ దేశ అందాల సుందరి 24 ఏళ్ల క్రిస్టినా పిస్కోవా ‘మిస్ వరల్డ్- 2024’గా నిలిచారు.
- Author : Pasha
Date : 10-03-2024 - 12:18 IST
Published By : Hashtagu Telugu Desk
Miss World 2024 : చెక్ రిపబ్లిక్ దేశ అందాల సుందరి 24 ఏళ్ల క్రిస్టినా పిస్కోవా ‘మిస్ వరల్డ్- 2024’గా నిలిచారు. ఈ కిరీటం ఆమెకు ఈజీగా దక్కలేదు. ముంబై వేదికగా జరిగిన 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ కాంపిటిషన్‌లో 111 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి దీన్ని క్రిస్టినా సాధించారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి, కెరీర్ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా(Miss World 2024) చెక్ రిపబ్లిక్ దేశంలోని ట్రినెక్ నగరంలో జన్మించారు.
- అనంతరం వీరి ఫ్యామిలీ దేశ రాజధాని ప్రాగ్‌కు షిఫ్ట్ అయింది.
- ఈమె లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేశారు.
- ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తిని పెంచుకున్నారు.
- 2022 మే 31న లండన్‌లోని ‘ఎలైట్ మోడల్ మేనేజ్‌మెంట్’లో చేరి, మెళకువలు నేర్చుకున్నారు.
- 2022లోనే నిర్వహించిన ‘మిస్ చెక్ రిపబ్లిక్’ పోటీల్లో పాల్గొని, తొలి ప్రయత్నంలోనే కిరీటం సాధించారు.
- ‘క్రిస్టినా పిస్కో ఫౌండేషన్’ను ఏర్పాటు చేసి ద్వారా ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- నిరుపేద చిన్నారుల కోసం టాంజానియాలో ఓ పాఠశాలను క్రిస్టినా ఏర్పాటు చేశారు. ఈ స్కూల్‌ను ప్రారంభించడమే తన జీవితంలో గర్వించదగ్గ విషయమని క్రిస్టినా పిస్కోవా చెప్పారు.
- ‘‘వివిధ కారణాల వల్ల ఇప్పటికీ ఎంతోమంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదు. అలాంటి వారిని చేరదీసి, విలువైన విద్యను అందించడమే నా లక్ష్యం’’ అంటూ మిస్ వరల్డ్ పోటీల ఫైనల్ రౌండ్‌లో క్రిస్టినా తెలిపారు.
- ‘‘విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. విద్యకు దూరంగా ఉంటున్న బాలల గురించి మాట్లాడటానికే నేనిక్కడి దాకా వచ్చా. ఈ అందాల పోటీల్లో గెలిచినా గెలవకపోయినా ఆ చిన్నారుల ఉన్నతికి శ్రమిస్తూనే ఉంటా’’ అని క్రిస్టినా పేర్కొన్నారు.
Also Read :DSC Hall Tickets : 25 నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు.. ఎగ్జామ్ కొత్త షెడ్యూల్
- క్రిస్టినా పిస్కోవా ఎత్తు 5.91 అడుగులు.
- ఆమె ఇంగ్లిష్, జర్మన్, పోలిష్ (పోలాండ్), స్లోవక్ (చెక్ రిపబ్లిక్, స్లోవకియా) భాషల్లో మాట్లాడగలరు.
- మ్యూజిక్, ఆర్ట్ అంటే ఆమెకు ఇష్టం.
- ఫ్లూట్, వయొలిన్ ప్లే చేయడాన్ని క్రిస్టినా ఇష్టపడతారు.
- చెక్ రిపబ్లిక్ నుంచి ప్రపంచ సుందరి కిరీటం అందుకున్న రెండో మహిళగా క్రిస్టినా నిలిచారు.