Showering – Hair : అది రాలిపోతుంది.. తలస్నానం టైంలో ఇలా చేయొద్దు
Showering - Hair : తలస్నానం చేసేప్పుడు మనం చేసే చిన్నచిన్న తప్పుల వల్ల జుట్టు రాలిపోతుంటుంది.
- Author : Pasha
Date : 13-11-2023 - 7:29 IST
Published By : Hashtagu Telugu Desk
Showering – Hair : తలస్నానం చేసేప్పుడు మనం చేసే చిన్నచిన్న తప్పుల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. డ్యామేజ్ అవుతుంటుంది. ఇంతకీ మన చేసే ఆ తప్పులేంటి? జుట్టు సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
వేడినీళ్లు
జుట్టును డ్యామేజ్ చేయడానికి వేడి నీళ్లు కూడా ఓ కారణమే. వేడినీళ్ల వల్ల జుట్టులోని సహజమైన నూనెలు ఆవిరవుతాయి. ఫలితంగా బట్టతల, జుట్టు పొడిబారి డ్యామేజ్ హెయిర్ ఇస్తుంది. జుట్టు రాలిపోవడానికి కూడా దారితీస్తుంది. అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం తర్వాత తలను మృదువుగా శుభ్రం చేయాలి.
షాంపూ
జుట్టుకు ఎక్కువ షాంపూ వాడటం మంచిది కాదు. అలా చేస్తే జుట్టు పొడిబారిపోతుంది. అది సహజమైన తేమను కోల్పోయి గడ్డిలా తయారవుతుంది. షాంపూను తక్కువగా వాడాలి. నేరుగా షాంపూను తలకు పెట్టొద్దు. దాన్ని కాస్త నీటితో డైల్యూట్ చేసి తలకు పెట్టాలి. సల్ఫేట్, పారాబెన్ ఫ్రీ ఉండే షాంపూలు వాడితే మంచిది.
కండీషనర్
జుట్టుకు షాంపూ ఎంత ముఖ్యమో.. ఆ వెంటనే కండీషనర్ అప్లై చేయడం కూడా అంతే ముఖ్యం. జుట్టును కండీషనింగ్ చేయకుంటే అది పొడిబారిపోతుంది. చిక్కులతో నిండిపోతుంది. జుట్టు చివర్లు చిట్లిపోతాయి. ఈ సమస్య రాకుండా ఉండేందుకు.. జుట్టు వరకే కండీషనర్ అప్లై చేసి.. గోరువెచ్చని నీటితో కడగండి. దీనివల్ల జుట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది.
టవల్
జుట్టును ఆరబెట్టుకునేందుకు కొందరు టవల్‌ను వాడుతారు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది. కాబట్టి తలస్నానం తర్వాత జుట్టును సున్నితంగా హ్యాండిల్ చేయండి. టవల్‌తో మెత్తగా ఒత్తి ఆరనివ్వండి.
హీటింగ్ టూల్స్
జుట్టును ఆరబెట్టడానికి డ్రయర్స్, హీటింగ్ టూల్స్ వాడొద్దు. జుట్టును స్మూత్ చేయడం కోసం, కర్ల్స్ చేయడం కోసం తడిజుట్టుపై ఎలక్ట్రిక్ టూల్స్ వాడటం సరికాదు. దీనివల్ల జుట్టు పొడిబారి రాలిపోతుంది. తప్పదు అనుకున్నప్పుడు ఆరిన జుట్టుకు.. హీటింగ్ ప్రొటెక్టర్ అప్లై చేసి, జుట్టును డిజైన్(Showering – Hair) చేసుకోవచ్చు.