Good Luck Plant : ఈ గుడ్ లక్ మొక్క మీ ఇంట్లో ఉంటే చాలు.. ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాల్సిందే..
అలా వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో ఈ గుడ్ లక్ మొక్క (Good Luck Plant) కూడా ఒకటి.
- Author : Naresh Kumar
Date : 29-12-2023 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
Good Luck Plant : హిందువులు ఎన్నో రకాల వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. ఇల్లు కట్టే విషయం నుంచి ఇంట్లో వస్తువుల అమరికల వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. అలా చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం గా అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అలా వాస్తు ప్రకారంగా పెంచుకునే మొక్కల వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడడంతో పాటు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అయితే అలా వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో ఈ గుడ్ లక్ మొక్క (Good Luck Plant) కూడా ఒకటి. ఇంతకీ ఆ మొక్క ఏది? ఆ మొక్కను ఇంట్లో ఎటువైపు పెంచుకోవాలి?ఆ మొక్క వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
రాత్రాణి మొక్క.. ఇంట్లో రాత్రాణి మొక్క ఉంటే ఇంటి చుట్టూ సువాసన వెదజల్లుతుంది. ఈ సువాసనకు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా మానసిక ఉల్లాసన నెలకొంటుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, దాంపత్య సంతోషాన్ని మరింత పెంచుతుంది. తద్వారా సంపాదనకు కొత్త మార్గాల అన్వేషనకు ఉపయోగ పడుతుంది. ఈ మొక్కల పూలు లేత పుసుపు రంగులో ఉండి అందంగా కనిపిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది.
చంపా మొక్క.. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. దీంతో కుటుంబ సభ్యలు మధ్య గొడవలు, తగాదాలు అనేవి ఉండవు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కుటుంబం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.
మల్లె మొక్క.. ఈ మొక్క పేరు వినగానే ముందుగా వాటి వాసన గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ మొక్క ఎక్కడ ఉన్న కూడా ఆ ప్రాంతమంతా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా మల్లె పూలు అంటే లక్ష్మీ దేవి అమ్మవారికి ప్రతీకరం అని చెబుతూ ఉంటారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
పారిజాత మొక్క.. పారిజాత మొక్క ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిది. ప్రతి కోరికను తీర్చుతుంది అని అంటారు. ఈ మొక్క శ్రీ కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన మొక్క. ఈ మొక్క మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తుంది.
Also Read: Health Benefits: మునగాకు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?