బరువు తగ్గడం కోసం చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి!
బరువు తగ్గడం కోసం చియా సీడ్స్ తీసుకోవడం మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు. మరి చియా సీడ్స్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 17-12-2025 - 6:31 IST
Published By : Hashtagu Telugu Desk
- చియా సీడ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చియా సీడ్స్ విషయంలో చేయకూడని తప్పులు
ఆ ఒక్క తప్పుతో ప్రాణాలకు ముప్పు
Chia Seeds: ఇటీవల కాలంలో చియా సీడ్స్ వాడకం పూర్తిగా పెరిగిపోయింది. బరువు తగ్గడం నుంచి ఇంకా అనేక విషయాల కోసం ఈ చియా సీడ్స్ ని ఉపయోగిస్తున్నారు. అలాగే ఆరోగ్యకరమైన ప్రోటీన్ బార్‌ల నుంచి ఫ్రూట్ జ్యూస్, డెజర్ట్ లలో కూడా చియా సీడ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచివే కానీ వాటిని తప్పుగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతాయట. మరి ఇంతకీ చియా సీడ్స్ ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఇలా అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి పాలీఫెనాల్స్, కాఫీక్ యాసిడ్, రోజ్‌మెరినిక్ యాసిడ్, మైరిసెటిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లకు కూడా గొప్ప మూలం అని చెప్పవచ్చు. కాగా చియా సీడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి, క్యాన్సర్ తో పోరాడటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది టైప్ 2 మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. చియా సీడ్స్ ఆరోగ్యకరమైనవి. కానీ వాటిని తప్పుగా తింటే తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయట.
చియా సీడ్స్ నానబెట్టకుండా తింటే ఆ తర్వాత నీరు తాగడం వల్ల ఈ గింజలు గొంతులో లేదా అన్నవాహికలో ఉబ్బి ఇరుక్కుపోవచ్చట. ఒకవేళ ఇలా జరిగితే ఇది ఎండోస్కోపీ ద్వారా తొలగించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీటిని మింగడంలో ఇబ్బంది లేదా ఇతర జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారిలో ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే చియాసీడ్స్ ఎప్పుడూ నానబెట్టి తర్వాత వాటిని తాగడం లేదా ఇతర స్వీట్ తయారీలో, సలాడ్స్ చేసుకోవడంలో ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. చియా సీడ్స్‌ను ఎల్లప్పుడూ సరైన పద్ధతిలో నానబెట్టి తినాలట. కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి తీసుకోవాలని చెబుతున్నారు. రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఇంకా మంచిది అని చెబుతున్నారు.