Pigeons : పావురాలను పెంచుకుంటున్నారా? వాటి వలన కలిగే ఆరోగ్య సమస్యలు గురించి మీకు తెలుసా?
కొంతమంది పావురాలను వాటి మీద ఉన్న ఇష్టంతో ఇంటిలోనే పెంచుకుంటున్నారు.
- By News Desk Published Date - 10:00 PM, Mon - 18 December 23

పావురాలను(Pigeons) మనం చాలా కాలం నుండి పెంచుకుంటున్నాము. అవి మనతో పాటు కలిసి జీవిస్తాయి. అయితే ఇదివరకు రోజుల్లో మనం పావురాల ద్వారా రాయబారాలు పంపేవారు. ఇప్పుడు పావురాలను ఉపయోగించడం తగ్గించాము అందువలన వాటి సంరక్షణ చూసేవారు తగ్గారు. అయితే పావురాలు మాత్రం మనం నివసించే ప్రాంతంలోనే గూడు కట్టుకుంటాయి. కొంతమంది పావురాలను వాటి మీద ఉన్న ఇష్టంతో ఇంటిలోనే పెంచుకుంటున్నారు.
పావురాలు ఇంటిలో పెరిగినా అవి మనకు ఎటువంటి హాని కలిగించవు. కానీ వాస్తు ప్రకారం ఇంటిలో పావురాలు ఉండకూడదు అని అంటారు. ఇంకా పావురాలు మన ఇంటిలోనే గూడు పెట్టుకుంటే అవి అక్కడే వాటి మలాన్ని, ఈకలను పడేస్తుంటాయి. వాటి వలన మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక పావురం ఏడాదికి పదకొండున్నర్ర కిలోల మలాన్ని విడుదల చేస్తుంది. ఈ మలం ఎప్పటికప్పుడు తీసేయకపోతే పొడిగా మారి గాలిలో వ్యాపిస్తుంది. దీని వలన శ్వాస సమస్యలు, అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ విధంగా వచ్చిన వాటిని సెన్సిటివిటీ న్యుమోనైటిస్ అంటారు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణానికి హాని కలుగుతుంది.
ఇంటిలో పావురాలు గూడు పెట్టుకోవడం కొంతమంది అశుభంగా కూడా భావిస్తారు. పావురాలు ఎక్కడైతే గూడు కట్టుకుంటాయో ఆ ప్రదేశం పావురాలకు అనుకూలంగా మరియు మానవులకు ప్రతికూలంగా మారుతుంది. ఆ ఇంటిలో ఉండేవారికి అశాంతి, పేదరికాన్ని కలుగజేస్తాయి అని అంటారు. కాబట్టి పావురాలను ఇంటిలో పెంచుకోకపోవడమే మంచిది. ఒకవేళ పెంచుకున్నా ఇంటి బయట లేదా పైన వాటికి సపరేట్ గా ప్లేస్ చూసి ఎప్పుటికప్పుడు ఆ ప్లేస్ ని క్లీన్ చేస్తూ ఉండాలి.
Also Read : Health Benefits: చలికాలంలో పెరుగు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?