Hibiscus: జుట్టు రాలడం ఆగిపోయి ఒత్తుగా పెరగాలి అంటే మందార పువ్వులతో ఇలా చేయాల్సిందే!
మందార పువ్వులను ఉపయోగించి జుట్టు రాలడం ఆగిపోయేలా చేయవచ్చని, అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరిగేలా చేయవచ్చని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:18 PM, Sun - 11 May 25

మందార పూల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మందార పువ్వులు ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి, జుట్టు పొడుగ్గా పెరగడానికి బాగా సహాయపడుతుంది. మరి మందార పువ్వులను ఉపయోగించి జుట్టు రాలడం ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హెయిర్ ఫాల్ సమస్యకు మందార పువ్వు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. మందార పువ్వును ఉపయోగించి కూడా మీరు వెంట్రుకలు ఊడిపోకుండా చేయవచ్చట.
అలాగే మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా, తెల్ల వెంట్రుకలు రాకుండా చేయవచ్చని చెబుతున్నారు. అయితే మరి ఇందుకోసం మందార పువ్వును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మందార పువ్వుల్లో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ మైక్రోబియల్ న్యూట్రిషన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మందార పువ్వులను ఒక పద్దతిలో ఉపయోగిస్తే మన జుట్టు ఆరోగ్యంగా, ఊడిపోకుండా ఉంటుందని చెబుతున్నారు. అయితే జుట్టుకు మందార పువ్వలును ఉపయోగించడానికి ముందుగా 12 నుంచి 15 మందార పువ్వులను తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలట. ఇప్పుడు ఈ ప్యాక్ ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలని చెబుతున్నారు. జుట్టుకు మందార ప్యాక్ ను 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచాలట. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా మందార పువ్వుల పేస్ట్ ను పెట్టడం వల్ల మీ జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుందట. అలాగే మందార పువ్వులతో నూనెను తయారుచేసి కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ఒకటి నుంచి రెండు కప్పుల కొబ్బరినూనెను తీసుకోవాలట. దీంట్లో మందార పువ్వులు వేసి కాసేపు మరగబెట్టాలట. కొబ్బరి నూనె రంగు మారినవెంటనే స్టవ్ ను ఆఫ్ చేయాలట. మందార పువ్వులను మరిగించిన కొబ్బరి నూనెను తరచుగా పెట్టడం వల్ల మీ జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. ఈ నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరుచుకోవాలని చెబుతున్నారు. ఈ నూనెను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుందట. అలాగే జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుందట. మందారం పువ్వులను ఈ విధంగా మీరు ఉపయోగించడం వల్ల మీ జుట్టు బాగా పొడుగ్గా పెరుగుతుందట. అలాగే జుట్టు ఒత్తుగా అవుతుందట. కొత్త జుట్టు కూడా వస్తుందని, అలాగే మందార పువ్వులను జుట్టుకు అప్లై చేయడం వల్ల డ్రై హెయిర్ సమస్య ఇక ఉండదని అలాగే మీ జుట్టు షైనీగా, మృదువుగా మారుతుందని చెబుతున్నారు. మందార పువ్వులు మన నెత్తిమీద రక్త ప్రసరణను పెంచడానికి కూడా సహాయపడతాయట. అలాగే జుట్టుకు మంచి పోషణను అందిస్తాయని, మందార పువ్వుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు హానికరమైన యువీ కిరణాల నుండి నెత్తిని రక్షిస్తాయని దీనిలోని శీతలీకరణ లక్షణాలు నెత్తిమీద ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు.