Hair Loss: జుట్టు రాలడం ఆగిపోయి.. మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే మీ వెంట్రుకలకు ఈ ఒక్కటి వాడాల్సిందే!
జుట్టు రాలే సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పదార్థం ఒకటి కలిపి రాస్తే చాలని, జుట్టు రాలడం ఆగిపోవడం ఖాయం అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:33 PM, Sun - 4 May 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. స్త్రీ పురుషులు చాలామంది ఈ జుట్టు రాలే సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హెయిర్ ఫాల్ కారణంగా జుట్టు పల్చగా మారిపోవడం సన్నగా అయిపోవడం లాంటి సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే జుట్టు రాలే సమస్య ఆగిపోయి జుట్టు బాగా పెరగడం కోసం ఎన్నెన్నో షాంపూలు హెయిర్ ఆయిల్స్ ఉపయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఈ విషయం గురించి చాలామంది చింతిస్తున్నారు. మీరు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జుట్టు రాలడం తగ్గించడంలో హాజల్ నట్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయట. కాగా హాజల్ నట్స్ లో విటమిన్ ఇ, విటమిన్ బి లతో పాటుగా మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయని, ఇవి నెత్తిమీద, జుట్టు కుదుళ్లకు పోషణను ఇస్తాయని చెబుతున్నారు. అంతేకాదు దీనిలో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును మాయిశ్చరైజ్ చేయడంతో పాటుగా కుదుళ్లను బలంగా చేస్తాయట. అలాగే ఇది జుట్టు తెగిపోవడాన్ని, రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుందట. అలాగే హాజెల్ నట్స్ లో ప్రోటీన్లు కూడా ఉంటాయట. ఇవి హెయిర్ షాఫ్ట్ ను బలోపేతం చేయడానికి, వెంట్రుకలు రాలకుండా చేయడానికి సహాయపడతాయని చెబుతున్నారు. హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవడానికి హాజెల్ నట్స్, గుడ్లతో హెయిర్ మాస్క్ లను తయారు చేయాలట.
గుడ్లలో ఉండే ప్రోటీన్ జుట్టును బలంగా చేస్తుందట. హాజెల్ నట్ ఆయిల్ నెత్తిమీద పోషణను అందిస్తుందని,అలాగే జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుందని ఇందుకోసం హెయిర్ మాస్క్ తయారు చేయడానికి గుడ్డును ఒక గిన్నెలో బాగా కలిసే వరకు గిలకొట్టాలని, దీనిలో హాజెల్ నట్ ఆయిల్ వేసి బాగా కలపి, ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు అప్లై చేయాల. దీన్ని మీ నెత్తికి అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయాలట.
అలాగే అవొకాడోలో ఉండే విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు పోషణను, తేమను అందిస్తాయట. హాజెల్ నట్ ఆయిల్ జుట్టును బలోపేతం చేస్తుందని, గ్లో గా చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల హాజెల్ నట్ ఆయిల్ లో బాగా పండిన ఒక అవొకాడో పేస్టును వేసి, ఈ హెయిర్ మాస్క్ ను మీ నెత్తికి, జుట్టుకు బాగా పట్టించాలని, ఈ ప్యాక్ ని తలపై 30 నిమిషాల పాటు అలాగే ఉంచి. తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు.