Hair Growth: జుట్టు రాలడం ఆగిపోయి పొడవుగా, ఒత్తుగా పెరగాలి అంటే బాదం నూనెలో ఈ ఒక్కటి కలిపి రాయాల్సిందే!
అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకుంటే బాదం నూనెలో ఇప్పుడు చెప్పబోయే ఒకటి కలిపి రాస్తే చాలు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:02 PM, Mon - 5 May 25

మామూలుగా చాలామంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. అయితే జుట్టు రాలడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. జుట్టు రాలడం ఆగడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా మందికి చుండ్రు, హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, వెంట్రుకలు తెగిపోవడం, బలహీనమైన జుట్టు వంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. వీటివల్ల జుట్టు పెరగడం కూడా ఆగిపోతుందట. ఏండ్లు గడుస్తున్నా జుట్టు మాత్రం ఇంచు కూడా పెరగదు. పైగా జుట్టు రాలిపోతూ ఉంటుంది.
అయితే ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంటే ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే చాలు అంటున్నారు. మరి అందుకోసం ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలబందలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. కాబట్టి మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బాదం నూనెలో అలోవెరా జెల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలట. దీని కోసం ఒక కప్పులో మీ జుట్టుకు సరిపడా నూనెను చేయాలట. దీనిలో 1 టీ స్పూన్ అలోవెరా జెల్ ను వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలట.
ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 4 గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. కరివేపాకు కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మీ జుట్టు నేచురల్ గా పొడవుగా పెరగాలంటే బాదం నూనెలో కరివేపాకును మిక్స్ చేసి అప్లై చేయాలనీ, ఇందుకోసం అరకప్పు నూనెలో 7 నుంచి 8 కరివేపాకు వేసి ఈ రెండింటినీ గ్యాస్ మీద కొంచెం వేడి చేయాలి. బాదం నూనెలో కరివేపాకు కొద్దిగా నల్లగా మారిన తర్వాత స్టవ్ ఆపేసి నూనె చల్లారనివ్వాలి. రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టుకుని ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. అదేవిధంగా ఒక చిన్న గిన్నెలో బాదం నూనె తీసుకుని అందులో అర టీ స్పూన్ మెంతులను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మంట మీద వేడి చేయాలి. మెంతులు ఎరుపు రంగులోకి మారే వరకు మరిగించి తర్వాత స్టవ్ ను ఆపేసి ఈ నూనె చల్లారిన తర్వాత జుట్టుకు పెట్టి కాసేపు మసాజ్ చేయాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలట.