Carrots for Lips : పెదాలు ఎర్రగా మారాలంటే క్యారెట్ ఇలా చేయాల్సిందే?
ముఖం ఎంత అందంగా ఉన్నా కూడా ముఖంపై చిరునవ్వు లేకుంటే ఏమీ బాగుండదు. అలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి అంటే పెదవులు కూడా ఎరువుగా
- By Anshu Published Date - 09:30 PM, Sun - 27 August 23

ముఖం ఎంత అందంగా ఉన్నా కూడా ముఖంపై చిరునవ్వు లేకుంటే ఏమీ బాగుండదు. అలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి అంటే పెదవులు కూడా ఎరువుగా ఉంటే ఆ నవ్వుకి మరింత అందం వస్తుంది. మామూలుగానే కొంతమందికి అనేక కారణాల వల్ల పెదవులు నలుపుగా ఉంటాయి. అయితే పెదాలు నలుపుగా ఉన్నవారు ఎర్రగా చేసుకోవడానికి అనేక రకాల చిట్కాలను ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని హోమ్ రెమెడీలను ఉపయోగించడం ద్వారా పెదాలను ఎర్రగా మార్చుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
క్యారెట్‌లో విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్‌లో విటమిన్లు ఇ, సి, ఎలు సరైన రక్త ప్రసరణని అందిస్తాయి. పెదాలు పొడిబారకుండా, వాటిని మెరిసేలా చేస్తాయి. దీనిని పెదాలకి అప్లై చేయడం వల్ల పెదాలు ఎర్రగా, మెరుస్తుంటాయి. ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం క్యారెట్-1, కొబ్బరినూనె-1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తరువాత క్యారెట్‌ని పొట్టుతీసి కట్ చేసి మిక్సీ పట్టుకొని, అందులో నుంచి రసం తీయాలి. క్యారెట్ నుండి తీసిన జ్యూస్‌ని కొద్దిగా కాటన్ సహాయంతో పెదవులకి అప్లై చేయాలి. ఆపై మసాజ్ చేసి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
తర్వాత కొద్ది కొబ్బరి నూనెని పెదాలకి అప్లై చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేయచ్చు. మీకు రిజల్ట్స్ వచ్చే వరకూ ఇలా చేయొచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇలా చేస్తే చాలు ఎర్రటి పెదవులు మీ సొంతం. అలాగే క్యారెట్ రసాన్ని తరచుగా తాగుతూ ఉండటం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. క్యారెట్ రసం తాగలేని వారు క్యారెట్ ని కూడా తినవచ్చు.