హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా.. ఆపిల్ తొక్కలతో ఇలా చెయ్యాల్సిందే!
హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఆపిల్ తొక్కలతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే హెయిర్ ఫాల్ సమస్యను అరికట్ట వచ్చు అని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆపిల్ తొక్కలతో ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 16-12-2025 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
- హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించే ఆపిల్ తొక్కలు
ఆపిల్ తొక్కలతో హెయిర్ ఫాల్ కీ చెక్
జుట్టు సమస్యలను తగ్గించే ఆపిల్ తొక్కలుHair Fall: ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో హెయిర్ ఫాల్ సమస్య కూడా ఒకటి. ఈ హెయిర్ ఫాల్ కారణంగా పురుషులు బట్టతల సమస్యతో బాధపడుతుంటే, మహిళలు పలుచని జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అయితే జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు బాగా పెరగడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రకరకాల హెయిర్ ఆయిల్స్ న్యాచురల్ పద్ధతులు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ హెయిర్ ఫాల్ సమస్యను అదిగమించడంలో ఆపిల్ తొక్కలు ఎంతో బాగా ఉపయోగపడతాయి.
ఎందుకంటే ఆపిల్ లో మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు నిండి ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని పెంచుతాయట. అనేక జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయని, అయితే ఆపిల్ తినేటప్పుడు చాలా మంది తొక్క తొలగిస్తారు. ఆపిల్ తొక్కలు ఎందుకు పనికిరావని డస్ట్ బిన్ లో పడేస్తూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఆపిల్ తొక్కలు చాలా బాగా సహాయపడతాయట. ఆపిల్ తొక్కలో ప్రొసైనిడిన్ బి2 మరియు బయోటిన్ ఉంటాయి. ఈ సహజ సమ్మేళనాలు జుట్టు సమస్యలకు చికిత్స చేయడానికి జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే విటమిన్లు, ఖనిజాలను ఆపిల్ తొక్క కలిగి ఉంటుందట. ఆపిల్ తొక్క జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.
మరి ఇంతకీ జుట్టుకు ఆపిల్ తొక్కలను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఒకటి లేదా రెండు ఆపిల్స్ ను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి. ఆపై పీల్ ను తొలగించాలట. ఉప్పు నీటిలో కడగడం వల్ల ఆపిల్ తొక్కపై ఏమైనా రసాయనాలు ఉంటే తొలగిపోతాయట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక అందులో యాపిల్ తొక్కలు వేసుకోవాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసే ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుందని చెబుతున్నారు. ఈ హెయిర్ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలట. ఆపై షవర్ గ్యాప్ ధరించాలని చెబుతున్నారు. 45 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి ఒక్కసారి ఇలా చేశారంటే హెయిర్ ఫాల్ సమస్యకు శాశ్వతంగా బై బై చెప్పవచ్చట.