Yellow Teeth: పసుపు పళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని తినాల్సిందే!
పసుపు పళ్ళతో ఇబ్బంది పడేవారు తప్పకుండా డైట్ లో కొన్ని రకాల వాటిని చేర్చుకోవాలని, కొన్నింటిని తినడం వల్ల పల్లపై గార తొలగిపోతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:00 PM, Mon - 30 December 24

అందమైన ముఖంతో పాటు చిరునవ్వు మనిషికి మరింత అందాన్ని ఇస్తుంది. ముఖం అంత అందంగా ఉండి పళ్ళు పసుపు పచ్చగా గార పట్టినట్టు ఉంటే అది అందవిహీనంగా కనిపించేలా చేస్తుంది. చాలామందికి పల్లపై గార పేరుకుపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొందరికి చూడడానికే చాలా దారుణంగా కనిపిస్తూ ఉంటాయి.. ఈ పసుపు పళ్ళ కారణంగా చాలామంది నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. పలని తెల్లగా చేసుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దంతాలపై ఉండే పసుపుదనాన్ని తొలగించుకోవడానికి కొన్నింటిని తింటే సరిపోతుందని చెబుతున్నారు.
అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరోగ్యకరమైన కూరగాయలలో బ్రకోలీ కూడా ఒకటి. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. బ్రోకలీలో ఉండే లక్షణాలు చిగురువాపును తగ్గిస్తాయి. అలాగే దంతాల పసుపును తొలగించడంలో కూడా సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం చాలా ముఖ్యమైనది. అందువల్ల కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల దంతాల తెల్లదనాన్ని కాపాడుతుందట. దంతాల పసుపును తొలగించడానికి మీరు పాలు, పెరుగు, జున్ను వంటివి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు దంతాల పసుపు కలర్ ను తొలగించడంలో సహాయపడతాయట.
కాగా మీ దంతాలు ముత్యాల్లాగా తెల్లగా మెరిసిపోవాలంటే స్ట్రాబెర్రీలను తినాలట. ఇందులో ఉండే ఎంజైమ్ లు, మాలిక్ యాసిడ్ దంతాల పసుపు లేయర్ ను తొలగిస్తుందని దీంతో మీ దంతాలు తెల్లగా మారుతాయని చెబుతున్నారు. దంతాల తెల్లదనాన్ని కాపాడటంలో సిట్రస్ పండ్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీని కోసం మీరు నారింజతో పాటు ఈ జాతికి చెందిన పండ్లను తీసుకోవచ్చట. ఇవి నోటి ఆరోగ్యానికి మంచివిగా భావిస్తారు. అలాగే మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయట. అలాగే రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల దంత చిగుళ్లు బలంగా మారుతాయి. అలాగే నోటి దుర్వాసన తొలగిపోతుంది. దంతాల పసుపు రంగు కూడా పోతుంది. దీంతో మీ పళ్లు తెల్లగా మిలమిల మెరుస్తాయని చెబుతున్నారు.