HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >How To Remove Warts 2

Warts: పులిపురి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

చాలామంది స్త్రీ,పురుషులకు ముఖం మెడ అలాగే శరీరంపై పులిపిర్లు వస్తూ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం ఈ పులిపిర్లు మెడ భాగంలోనే వస్తూ ఉంటాయి. కొంతమంద

  • Author : Anshu Date : 25-07-2023 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Warts
Warts

చాలామంది స్త్రీ,పురుషులకు ముఖం మెడ అలాగే శరీరంపై పులిపిర్లు వస్తూ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం ఈ పులిపిర్లు మెడ భాగంలోనే వస్తూ ఉంటాయి. కొంతమందికీ ఈ పులిపిర్లు వేధిస్తూ ఉంటాయి. మెడ చుట్టూ భాగంలో ఎక్కువగా పులిపిర్లు వచ్చి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. పులిపిర్లు రావడానికి ప్రధాన కారణం వైరస్. ఈ పులిపిర్లు ఎక్కువగా యుక్త వయసు వారికీ వస్తూ ఉంటాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ఒకవేళ ఒత్తిడి పడేచోట అంటే అరచేతులు, అరికాళ్లు తదితర ప్రాంతాల్లో ఉంటే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి.

పులిపిర్లను తగ్గించేందుకు ఆయుర్వేద, గృహ చిట్కాలు ఉన్నాయి. పులిపిరి వచ్చిన చోట వాటర్ ఫ్రూఫ్ స్టిక్కింగ్ టేప్‌ని రెండు మూడు పొరలుగా అతికించాలి. ఆరు రోజులు అలాగే ఉంచి టేప్ తొలగించాలి. 12 గంటలపాటు గాలిని తగలనిచ్చి మళ్లీ ఆరు రోజులపాటు టేప్‌ని అతికించాలి. దీంతో వార్ట్స్ శుష్కించిపోయి ఊడి వచ్చేస్తాయి. టేప్ కారణంగా గాలిచొరబడని వాతావరణం ఏర్పడటం వల్ల వైరస్ నశిస్తుంది. అలాగే వెల్లుల్లి రేకలను పులిపిర్లపై రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణంవల్ల పులిపిర్లు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి. అలాగే ఉల్లిపాయను సగానికి కోసం మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది.

దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజులపాటు పులిపీర్ల పై ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతో గానీ లేదంటే మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిర్ల పైన ప్రయోగించాలి. కొత్త సున్నాన్ని పులిపీర్ల పైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుపక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి. రావిపట్టను కాల్చి మసిచేసి సమంగా కొత్త సున్నం, వెన్న కలిపి పైకి పూయాలి. లేదా కొత్త సున్నాన్ని తమలపాకు రసంతో సహా కలిపి నూరి పులిపిరులపైన పూయాలి. పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్-ఎ, విటమిన్-సిలను పైపూతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • home-remedies
  • remove warts
  • warts
  • Warts tips

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

  • Are your teeth feeling sensitive? You simply must follow these tips

    Sensitive Teeth: పళ్ళు జివ్వుమంటున్నాయా? ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd