Bitter Gourd : కాకరకాయ చేదు తగ్గడానికి ఈ చిట్కాలు మీకు తెలుసా?
కాకరకాయను అందరూ ఇష్టంగా తినరు. ముఖ్యంగా చేదు ఉందని తినరు. కాబట్టి కాకరకాయ చేదు(Bitter) తగ్గించి వండుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
- Author : News Desk
Date : 05-08-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
కాకరకాయ(Bitter Gourd)లో ఎన్నో రకాల గుణాలు ఉన్నాయి. కాకరకాయను తినడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. క్యాన్సర్ తో పోరాడే వ్యతిరేక గుణాలు కాకరకాయలో ఉన్నాయి. అయితే కాకరకాయను అందరూ ఇష్టంగా తినరు. ముఖ్యంగా చేదు ఉందని తినరు. కాబట్టి కాకరకాయ చేదు(Bitter) తగ్గించి వండుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
* కాకరకాయ తొక్క భాగం పీలర్ తో తీసి వండుకున్నా చేదు తగ్గుతుంది.
* కాకరకాయను లోపల గింజలు పూర్తిగా తీసేసి వండుకుంటే చేదు తగ్గుతుంది.
* కాకరకాయను ముక్కలుగా కోసి వాటిని ఉప్పు, పసుపు వేసి కలిపి కడిగితే చేదు తగ్గుతుంది.
* కాకరకాయలు ముక్కలుగా కోసి వాటిని ఉప్పు కలిపిన నీటిలో ఉడికించి తరువాత వండుకుంటే కాకరకాయ చేదు తగ్గుతుంది. ముక్కలు కూడా మెత్తగా ఉంటాయి.
* కాకరకాయ ముక్కలను మజ్జిగలో వేసి పిండి కూర వండుకున్నా చేదు తగ్గుతుంది.
* కాకరకాయను బాగా డీప్ ఫ్రై చేసినా కూడా చేదు తగ్గుతుంది.
* కాకరకాయ కూర వండేటప్పుడు చిన్న బెల్లం ముక్కలు వేసి వండుకుంటే చేదు తగ్గుతుంది.
Also Read : Chocolate Mysore Pak : చాకొలేట్ మైసూర్ పాక్ ఎలా తయారుచేయాలో తెలుసా?