HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >How To Prevent Pimples Know Here Effective Home Remedies

Pimples: మొటిమలుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఫేస్ పాక్స్ ట్రై చేయాల్సిందే?

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది మొటిమల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మొటిమల వల్ల ముఖం అందవిహీనంగా తయారవుతూ ఉంటుంది. అంత

  • By Anshu Published Date - 10:30 PM, Mon - 31 July 23
  • daily-hunt
Pimples
Pimples

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది మొటిమల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మొటిమల వల్ల ముఖం అందవిహీనంగా తయారవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ మొటిమలు వచ్చిన ప్రదేశంలో గుంతలు ఏర్పడి ముఖం చెడిపోతుంది. కాకా మొటిమల సమస్యలతో విసిగిపోయారా. అయితే ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాల్సిందే. మరి మొటిమల సమస్యకు ఎటువంటి ఫేస్ ప్యాక్ ట్రై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చల్లటి పాలలో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, అదే సమయంలో ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. పెరుగులో కూడా మళ్లీ లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది, సహజ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ క్లెన్సింగ్ సూటింగ్ లక్షణాలతో సున్నితమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది.

గుమ్మడికాయలో యాంటీఆక్సిడెంట్లు జింక్ పుష్కలంగా ఉండటంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఉపశమనం తేమ చేస్తుంది. ఇది సున్నితమైన ఆల్ఫా హైడ్రాక్సీ పనితీరును కలిగి ఉంటుంది. అయితే రిచ్ బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పోషిస్తాయి. దగ్గు, జలుబు నుండి దూరంగా ఉండడానికి వ్యాయామం, వర్కౌట్ చేసిన వెంటనే ఫ్రిజ్ నుండి తీసిన చల్లని నీటిని తాగకూడదు. పార్టీ సీజన్‌లో ఆల్కహాల్‌ను అతిగా సేవించవద్దు. అంతేకాకుండా అన్ని టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడటానికి తగినంత నీరు తీసుకోవడంతో సమతుల్యతను ఎదుర్కోవటానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా మొటిమల సమస్య తగ్గదు. అలాంటప్పుడు అసలు లోపం
ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

తాజా కూరగాయలు, పండ్లు తినాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నిద్రలేకపోయినా సమస్య వస్తుంటుంది. కాబట్టి హాయిగా నిద్రపోవాలి. వ్యక్తిగత శుభ్రం చాలా ముఖ్యం. పడుకునే దుప్పట్లు, బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉండాలి. రోజుకి రెండు సార్లు ముఖం కడగాలి. బయటికి వెళ్లిన ప్రతీసారి సన్ స్క్రీన్ లోషన్ రాయాలి. చుండ్రు ఉన్నా కూడా ఆ ప్రభావం ముఖంపై పడి సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి ముందుగా తగ్గించుకోవాలి. పొల్యూషన్‌లో ఉన్నా కూడా సమస్య ఎక్కువవుతుంది. బయటికి వెళ్లినప్పుడు ఏదైనా క్లాత్‌తో ముఖాన్ని కవర్ చేయాలి. ముఖాన్ని గిల్లడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య ఇంకా తీవ్రమవుతుందని గుర్తుంచుకోవాలి. మొటిమలు టీనేజ్‌లో మొదలయ్యే ఈ సమస్య అంత త్వరగా పోదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాంటప్పడు కొన్ని చిట్కాలు వాడడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.

చెంచా పసుపు, తేనె, పాలు కలిపి మంచి క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపై రాయాలి. కాస్తా ఆరాక నీటిని స్ప్రే చేసి మెల్లిగా రుద్దుతూ చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల సమస్య చాలావరకూ తగ్గుతుంది.. అదేవిధంగా కలబందలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఎంజైమ్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు మొటిమలు తయారయ్యేందుకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడి సమస్యను అదుపు చేస్తుంది. ఇది పొడి చర్మం వారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.. అలాగే సిట్రస్ జాతి పండ్లు నిమ్మ, నారింజ వంటివి చర్మంలోని బ్యాక్టీరియాను పోగొట్టి మొటిమలను దూరం చేస్తాయి. ఈ ప్యాక్స్ వేసుకోవడం వల్ల ముఖం తాజాగా మారి అందంగా కనిపిస్తారు..ఈ పండ్ల గుజ్జులో ముల్తానీ మట్టి, బియ్యం పిండి, శనగపిండి ఇలా ఏదైనా పొడిని కాస్తా కలిపి రాయాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి…అదేవిధంగా పెరుగుకి చర్మాన్ని చల్లబర్చే గుణం ఉంటుంది. ఇందులో బియ్యంపిండి లేదా శనగపిండి వేయాలి. అందులోనే చిటికెడు పసుపు వేయాలి. దీన్ని ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauty tips
  • home-remedies
  • pimples

Related News

Dye Hair

Dye Hair : తెల్లజుట్టుతో విసిగిపోయారా, పసుపులో కొన్ని పదార్థాలు కలిపి రాస్తే నల్లగా నిగనిగ!

జుట్టు తెల్లబడడం ఎవరికీ ఇష్టముండదు. అలాంటివారు జుట్టుని నల్లగా మార్చుకునేందుకు హెయిర్ కలర్స్, డైలు వాడుతుంటారు. దీని వల్ల జుట్టు నల్లగా మారుతుంది. కానీ, మార్కెట్లో దొరికే డైలలో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఇవి అలర్జీలకి కారణమవుతాయి. దురద, కురుపులు, రాషెస్ వంటి సమస్యలొస్తాయి. అంతేకాకుండా, జుట్టు కూడా పాడవుతుంది. అలా కాకుండా జుట్టుని నేచురల్‌గానే నల్లగా మార్చుకోవాలంటే ఏం

  • Mouth Ulcers

    ‎Mouth Ulcers: తరచూ నోటి పూత సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే!

Latest News

  • Weight Loss : బరువు తగ్గడానికి ఏది మంచిది?..రన్నింగ్ లేదా వాకింగ్!

  • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

  • IND VS SA : గాయంతో రెండో టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్.. భారత్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న రిషబ్ పంత్!

  • Suryakumar Yadav : ముంబై కొత్త సారథిగా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు!

  • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

Trending News

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

    • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

    • IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియా కెప్టెన్ ఎవ‌రంటే?!

    • IND vs SA: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరం?

    • Nishant Kumar: ఎవరీ నిశాంత్ కుమార్‌.. సీఎం నితీష్ కుమార్‌కు ఏమ‌వుతారు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd