Idly Fries : మిగిలిపోయిన ఇడ్లీలతో ఫ్రైస్ ఎలా చేసుకోవాలో తెలుసా.. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే సరికొత్తగా..
మిగిలిపోయిన ఇడ్లీ(Idly)లతో అందరూ ఉప్మా(Upma) చేసుకుంటూ ఉంటారు. అలాగే మిగిలిపోయిన ఇడ్లీలతో ఫ్రైస్(Idly Fries) కూడా చేసుకోవచ్చు.
- Author : News Desk
Date : 18-08-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
మిగిలిపోయిన ఇడ్లీ(Idly)లతో అందరూ ఉప్మా(Upma) చేసుకుంటూ ఉంటారు. అలాగే మిగిలిపోయిన ఇడ్లీలతో ఫ్రైస్(Idly Fries) కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ ఫ్రైస్ తయారుచేసుకుంటే ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే ఎక్కువ రుచిగా ఉంటాయి.
ఇడ్లీ ఫ్రైస్ తయారీకి కావలసిన పదార్థాలు..
* ఇడ్లీలు ఆరు
* నూనె తగినంత
* ఎండుమిర్చి ఆరు
* పల్లీలు కొన్ని
* శనగపప్పు ఒక స్పూన్
* మినపపప్పు ఒక స్పూన్
* బియ్యం ఒక స్పూన్
* మిరియాలు నాలుగు
* ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్
* ఆమ్ చూర్ పొడి ఒక స్పూన్
* ఇంగువ చిటికెడు
* ఉప్పు తగినంత
* కరివేపాకు రెండు రెమ్మలు
ఒక మూకుడులో కొద్దిగా నూనె వేసి దానిలో ఎండుమిర్చి, మినపపప్పు, శనగపప్పు, పల్లీలు,బియ్యం, మిరియాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వాటిని చల్లార్చి తగినంత ఉప్పు వేసి మిక్సి పట్టాలి. ఒక మూకుడులో ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె పెట్టుకొని కాగనివ్వాలి. ఇడ్లీలను నిలువుగా మూడు లేదా నాలుగు ముక్కలు చేసుకొని వాటిని కాగిన నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తరువాత వాటిని ఒక ప్లేటులో తీసుకొని వాటిపై మనం అంతకు ముందు పొడి చేసుకున్న దానిని చల్లాలి. ఫ్రై చేసిన ఇడ్లీలకు రెండు వైపులా ఆ పొడిని అద్దేలా చేసుకొని తింటే క్రిస్పీ గా, రుచిగా ఉంటాయి. దీనికి చట్నీ కూడా పెట్టుకొని తినొచ్చు.
Also Read : Mokkajonna Vada : వర్షాకాలంలో వేడివేడిగా మొక్కజొన్న వడలు.. ఇంట్లోనే చేసుకోండిలా?