Onion Powder : ఉల్లిపాయల బదులు.. ఉల్లిపాయల పొడి వాడుకోవచ్చు.. ఎలా తయారుచేయాలో తెలుసా?
ఉల్లిపాయలతో ఉల్లిపాయ పొడిని తయారుచేసుకొని పెట్టుకుంటే మనం దానితో వంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
- Author : News Desk
Date : 23-01-2024 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
మనం ఏదయినా కూర వండాలన్నా, ఏ వంటలోకి అయినా దాదాపు అన్నిట్లో ఉల్లిపాయలు కావాలి. అయితే ఉల్లిపాయలు(Onions) ఇటీవల అప్పుడప్పుడు రేటు బాగా పెరుగుతున్నాయి. ఎంత రేటు పెరిగినా మనం కూర వండుకోవడానికి కనీసం ఒక ఉల్లిపాయ అయినా కావాలి. కాబట్టి మనం ఉల్లిపాయలతో ఉల్లిపాయ పొడిని(Onion Powder) తయారుచేసుకొని పెట్టుకుంటే మనం దానితో వంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఉల్లిపాయ కోయకుండా ఉల్లిపాయ పొడిని కూరల్లో వేసుకోవచ్చు.
ఉల్లిపాయ పొడి తయారీ విధానం :
ముందు కొన్ని ఉల్లిపాయలను తీసుకొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. వాటిని శుభ్రంగా కడుగుకొని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. వాటిని ఎండలో పెట్టుకోవాలి. ఎండలో బాగా ఉల్లిపాయలను ఎండబెట్టుకోవాలి. ఉల్లిపాయలు పొడి పొడిగా మారతాయి. అనంతరం వాటిని మిక్సిలో వేసి పొడి చేసుకోవాలి. ఉల్లిపాయ పొడి రెడీ అయినట్లే.
ఇలా తయారుచేసుకున్న ఉల్లిపాయ పొడిని ఒక పొడి సీసాలో వేసుకొని ఉంచుకుంటే అది నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. దానిని వాడుకునేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలి. అప్పుడే అది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఉలిపాయ పొడిని ఉల్లిపాయల బదులుగా అన్నిట్లోనూ వాడుకుంటే ఉల్లిపాయల టేస్ట్ వస్తుంది.
Also Read : White Bedsheets : హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?