Tawa Pulao: తవా పులావ్ ఇలా చేస్తే.. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం?
మామూలుగా మనం ఇంట్లో ఎప్పుడూ తినే వంటకాలు రెసిపీలు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే చాలామంది స్త్రీలు భర్త పిల్లలకు ఏదైనా కొత్తగా ర
- By Anshu Published Date - 09:00 PM, Tue - 16 January 24

మామూలుగా మనం ఇంట్లో ఎప్పుడూ తినే వంటకాలు రెసిపీలు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే చాలామంది స్త్రీలు భర్త పిల్లలకు ఏదైనా కొత్తగా రెసిపీ చేసి పెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఇక యూట్యూబ్ లాంటివి చూసినా కూడా ఏవేవి ఎంత మోతాదులో వేయాలో తెలియక కొన్ని కొన్ని సార్లు రెసీపీలు చెడిపోతూ ఉంటాయి. మీరు కూడా అలా ఏదైనా సరికొత్తగా రెస్పీరెసిపీ ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే తవా పులావ్ ఇలా చేస్తే చాలు బట్టలు వేసుకుని మరీ తినేస్తారు.. మరి ఈ రెసిపీ ని ఎలా తినాలి అన్న విషయానికొస్తే..
తవా పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:
అన్నం లేదా బియ్యం, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, బటర్, ఆయిల్, ఉల్లి పాయ, పచ్చి మిర్చి, టమాటాలు, పచ్చి బఠాణి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పావ్ భాజీ మసాలా, నిమ్మ రసం, కొత్తి మీర వీటన్నింటినీ కూడా తగిన మోతాదులో తీసుకోవాలి.
తవా పులావ్ తయారీ విధానం:
ముందుగా నార్మల్ రైస్ లేదా బస్మతీ బియ్యంతో పొడి పొడిగా అన్నాన్ని సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి తీసుకుని అందులో ఆయిల్, కొద్దిగా బటర్ వేసి వేయించాలి. తర్వాత జీలకర్ర, ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక టమాట ముక్కలు, బఠాణీ వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు, కారం, పసుపు వేసి మిగిలిన పొడులు కూడా వేసి ఒకసారి కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మసాలాలు మాడి పోకుండా నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఆ తర్వాత అన్నం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. అవసరం అయితే కొద్దిగా బటర్ వేసుకోవచ్చు. నెక్ట్స్ కొత్తి మీర కూడా అంతా చల్లుకొని మరొక సారి కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే తవా పులావ్ రెడీ.