Gongura Pulihora: ఎప్పుడైన గోంగూర పులిహోర తిన్నారా.. అయితే తయారు చేసుకోండిలా?
మామూలుగా మనం గోంగూరతో పచ్చడి, పప్పు, మసాలా కర్రీ, ఎగ్ కర్రీ, లాంటి వంటలు ఇప్పటివరకు మనం తిని ఉంటాం. కానీ గోంగూరతో తయారుచేసిన పులిహోర ని ఎప
- By Anshu Published Date - 08:00 PM, Thu - 27 July 23

మామూలుగా మనం గోంగూరతో పచ్చడి, పప్పు, మసాలా కర్రీ, ఎగ్ కర్రీ, లాంటి వంటలు ఇప్పటివరకు మనం తిని ఉంటాం. కానీ గోంగూరతో తయారుచేసిన పులిహోర ని ఎప్పుడైనా తిన్నారా. వినడానికి కాస్త వెరైటీగా డిఫరెంట్ గా ఉన్న ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గోంగూర పులిహోరకు కావలసిన పదార్థాలు:
బియ్యం : 1/4 గ్లాస్
గోంగూర కట్టలు : 4
పల్లీలు : 2 టీ స్పూన్లు
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
పచ్చిమిరపకాయలు : 8
ఇంగువ: చిటికెడు
నూనె : 2 టేబుల్ స్పూన్లు
తాలింపు దినుసులు – కొద్దిగా
కరివేపాకు- ఒక రెమ్మ.
గోంగూర పులిహోర తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా అన్నం వండుకొని పొడిపొడిగా చేసి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోంగూర ఆకులను కోసి నీటితో బాగా శుభ్రం చెయ్యాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి కాగాక, పచ్చిమిర్చిని, కడిగిన గోంగూరను వేసి ఉడికించుకోవాలి. గోంగూర బాగా మగ్గిన తర్వాత పప్పు గిత్తి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల గోంగూర గుజ్జుగా మారి అన్నంలో ఇట్టే కలిసిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద మరో బాణలి పెట్టుకొని తాలింపుకు సరిపడా నూనె పోసుకోవాలి. కాగిన నూనెలో తాలింపు దినుసులను ఒక్కొక్కొటిగా వేసుకోవాలి. అంటే జీలకర్ర, ఆవాలు, పప్పు, సాయి పెసరపప్పు, పల్లీలు, ఎండు మిర్చి,2 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు, కరివేపాకు, ఇంగువ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపును, మెత్తగా చేసిన గోంగూరను చల్లార్చిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా వెరైటీగా ఉండే గోంగూర పులిహోర రెడీ.