Dry Feet: పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ తో పాదాలు సాఫ్ట్ గా మారడం ఖాయం!
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే పాదాల పగుళ్ల సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:03 AM, Thu - 20 February 25

మామూలుగా స్త్రీ పురుషులకు చాలామందికి కాళ్ల పగుళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ పాదాల పగుళ్ల సమస్యలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటాయి. నడవడానికి కూడా కాదు. కొన్నిసార్లు ఇలా చీలికల నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. రాత్రిళ్ళు పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక పాదాల పగుళ్ల సమస్య తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, స్ప్రే లు వాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ పాదాల పగుళ్ల సమస్య పోదు. మరి అలాంటప్పుడు ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి సమస్యకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొద్దిగా కొబ్బరినూనెను తీసుకొని చర్మపు పొరల్లోకి ఇంకే వరకు పాదాలపై మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా రాత్రంతా పాదాలను ఇలానే వదిలేసి నిద్రపోవాలి. ఇలా తరచుగా చేస్తే కొద్ది రోజుల్లోనే పాదాలపై చర్మం తిరిగి కోమలంగా మారుతుందట. ఇంకా పొడిబారిన పెళుసు బారిన చర్మానికి కొబ్బరి నూనె తగినంత తేమని అందించి తిరిగి మృదువుగా మారుస్తుందని చెబుతున్నారు.
పాదాల పగుళ్ళ సమస్యకు తేనె కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పొడిగా ఉండే పెదాలకు తేనెను అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత పది నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మానికి తేనెను అందించడంతోపాటు మృదువుగా మారతాయట.
కలబంద కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబందను తీసుకొని పాదాలకు బాగా అప్లై చేసి పది నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని ఇలా రోజుకు రెండు సార్లు చొప్పున క్రమం తప్పకుండా చేస్తే పాదాలు కోమలంగా మారుతాయట.
ముఖ్యంగా కాళ్లు, పాదాలపై గాయాలతో బాధపడే వారు అవి పూర్తిగా తగ్గిన తర్వాతే ఈ చిట్కాలను పాటించాలట. ముఖ్యంగా మరీ వేడిగా ఉన్న నీటితో కాళ్లు, పాదాలు శుభ్రం చేసుకోకూడదని చెబుతున్నారు. రోజూ స్నానం చేసిన తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవాలని చెబుతున్నారు. ఇంకా మరీ బిగుతుగా ఉండే సాక్సులు, షూస్, చెప్పులు వంటివి ధరించకూడదని చెబుతున్నారు. ఎక్స్‌ఫోలియేషన్ కి ఉపయోగించే పరికరాలను ఎప్పటికప్పుడు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.