New Wedding Trends :విసినేషన్ వెడ్డింగ్.. ప్రీ వెడ్డింగ్ షూట్.. నయా మ్యారేజ్ ట్రెండ్స్
కాలం మారుతుంటుంది.. దానికి అనుగుణంగా జనం టేస్ట్ కూడా మారుతుంటుంది.. జీవితంలో అత్యంత విశేష ఘట్టమైన పెళ్లిలోనూ అంతే.. వెడ్డింగ్స్ విషయంలో ఈ చేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది.. కరోనాకు ముందు వరకు డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ నడిచింది.. కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరో కొత్త మ్యారేజ్ ట్రెండ్ నడుస్తోంది.అదే.. విసినేషన్ వెడ్డింగ్ (Vicination Wedding)!!
- By Pasha Published Date - 01:07 PM, Mon - 5 June 23
కాలం మారుతుంటుంది..
దానికి అనుగుణంగా జనం టేస్ట్ కూడా మారుతుంటుంది..
జీవితంలో అత్యంత విశేష ఘట్టమైన పెళ్లిలోనూ అంతే..
వెడ్డింగ్స్ విషయంలో ఈ చేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది..
కరోనాకు ముందు వరకు డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ నడిచింది..
కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరో కొత్త మ్యారేజ్ ట్రెండ్ నడుస్తోంది.
అదే.. విసినేషన్ వెడ్డింగ్ (Wedding)!!
విసినేషన్ అంటే లోకల్ ఏరియా. సుదూర ప్రదేశాలకు వెళ్లకుండా పెళ్లిని తమ ఏరియాలోనే చేసుకోవడాన్ని విసినేషన్ వెడ్డింగ్ అంటారు. వాస్తవానికి మన భారత సంస్కృతి కూడా విసినేషన్ వెడ్డింగ్ కే ప్రాధాన్యత ఇస్తుంది. మన వాళ్ళు.. మన ఊరు .. మన ఏరియా మధ్యన పెళ్లి జరిగితే .. ఆ సంతోషమే వేరు!! ఎంత అద్భుతమైన డెస్టినేషన్ కు వెళ్లి మ్యారేజ్ చేసుకున్నా ఈ ఆనందం దొరకదు. విసినేషన్ వెడ్డింగ్ కు(Vicination Wedding) బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. అతిథులకు అసౌకర్యం కలగడం అనే మాటే ఉండదు. ఎందుకంటే మ్యారేజ్ జరిగేది లోకల్ లోనే కాబట్టి. దీనివల్ల పెద్దగా ఖర్చులు కూడా ఉండవు. డెస్టినేషన్ వెడ్డింగ్ ను గనుక ఎంచుకుంటే.. ట్రావెలింగ్ ఖర్చులు, హోటల్స్ లో ఉండే ఖర్చులు , భోజన ఖర్చులు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఖర్చులు అన్నీ కలిసి తడిసి మోపెడవుతాయి. విసినేషన్ వెడ్డింగ్ లో ఇవి ఉండనే ఉండవు. కాబట్టి సగటు ఆడపిల్ల తండ్రిపై ఆర్థిక భారం చాలావరకు తగ్గుతుంది. ఆడంబరాలకు పోయి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే కంటే .. అణకువగా ఉండి విసినేషన్ వెడ్డింగ్ చేసుకుంటే ఎంతో మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. ఈవిధంగా మిగిల్చే అనవసర ఖర్చును భవిష్యత్ అవసరాల కోసం వాడుకునేలా ప్లాన్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
Also read : Condoms-Wedding Kit : ప్రభుత్వ వెడ్డింగ్ కిట్ లో.. కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు
ప్రీ వెడ్డింగ్ షూట్.. ఆ వీడియో వైరల్
పెళ్లికి ముందు ఫొటో షూట్.. ఇప్పుడు ఈ ట్రెండ్ పెరిగింది. జీవితాంతం ప్రత్యేక జ్ఞాపకాలుగా ఉండిపోయేందుకు ఈ ఫొటో షూట్ ను చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఇటీవల ఒక జంట నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్ ను ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగా యువతి తన ఇంట్లోకి వచ్చిన నాగుపామును చూసి సాయం కోసం కాల్ చేస్తుంది. ఇద్దరు యువకులు స్కూటర్ పై ఆ ఇంటికి వస్తారు. ఆ ఇద్దరిలో ఓ యువకుడు నాగపామును బాక్స్ లో బంధించి స్కూటర్ పై తీసుకెళతాడు. వెళుతూ వెళుతూ వెనక్కి చూసి.. ఫోన్ కాల్ చేయాలని యువతికి సైగ చేస్తాడు. ఆ తర్వాత యువతి కాల్ చేసి.. అతడితో మాట్లాడి.. ప్రేమలో పడిపోతుంది. చివరికి వారిద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని ముందుకు నడుస్తుంటే.. నాగుపాము పడగ విప్పి వారినే చూస్తుంటుంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ లో క్లైమాక్స్ ఇదే !!
Tags
Related News
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్‌తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగ�