Hot Shower Side Effects: ఏంటి.. చలికాలంలో వేడినీటితో స్నానం చేస్తే ఇన్ని సమస్యలా?
Hot Shower Side Effects: చలికాలంలో వేడినేటితో స్నానం చేసేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలి అని చెబుతున్నారు. అలాగే చలికాలం వేడి నీటి స్నానంతో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 11-12-2025 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
Hot Shower Side Effects: చలికాలం మొదలయ్యింది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. దీంతో జనాలు ఉదయం 9 అయినా కూడా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇకపోతే చలికాలం వచ్చింది అంటే చాలు ముఖం కడుక్కోవడం చేతులు శుభ్రం చేసుకోవడం అలాగే స్నానం చేయడం ఇవన్నీ కూడా వేడి నీటితోనే చేస్తూ ఉంటారు. ఎందుకంటె చలికాలంలో నీరు చాలా చల్లగా ఉంటాయి. వీటి కారణంగా చేతులు తిముర్లు పుడుతూ ఉంటాయి. ఇక చేయడానికి అయితే వేడి నీళ్లు తప్పనిసరిగా ఉండాల్సిందే.
అయితే చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే చర్మంపై ఉండే సహజ నూనెలను తొలగిపోతాయట. ఈ నూనెల లోపం వల్ల చర్మం త్వరగా పొడిబారుతుందని, పగుళ్లు వస్తాయని, చర్మం బిగుతుగా అనిపిస్తుందని, చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుందని కొన్నిసార్లు చర్మం ఎక్కువగా పగిలి మంటగా కూడా అనిపిస్తూ ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే చర్మంలో చికాకు పెరుగుతుందట. దీనివల్ల చర్మంపై దురద, మంట, దద్దుర్లు, ఎరుపు కనిపిస్తాయట సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది వెంటనే ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
కాగా వేడి నీరు చర్మానికి మాత్రమే కాదు తలపై చర్మానికి కూడా అంత మంచిది కాదట. ఇది తేమను లాగేస్తుందట. దీనివల్ల జుట్టు పొడిబారడం, చిట్లడం, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. కాగాచర్మం తేమ కోల్పోయినప్పుడు దాని రక్షణ పొర బలహీనపడుతుందని, ఇది ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర చర్మ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అవసరానికి మించి వేడి నీరు చేస్తే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుందట. దీనివల్ల కొందరిలో రక్తపోటు హెచ్చుతగ్గులు అవుతాయని, వృద్ధులకు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. చాలా వేడి నీరు కొన్నిసార్లు మిమ్మల్ని శక్తివంతం చేయడానికి బదులుగా నీరసంగా మార్చవచ్చట. శరీరం మరింత రిలాక్స్ అవుతుందని, దీనివల్ల చాలా మంది స్నానం చేసిన తర్వాత అలసిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు చలికాలంలో వేడి నీటితో స్నానం చేయాలి అనుకుంటే కేవలం గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలనీ, ఎక్కువగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం అసలు మంచిది కాదని చెబుతున్నారు.