Rs 1 Lakh Umbrella: అదిదాస్, గుక్సీ.. గొడుగు కాని గొడుగు @ 1 లక్ష
గొడుగు కాని గొడుగు ఏది ? అంటే.. "పుట్ట గొడుగు" అని మాత్రం చెప్పకండి!! అది చాలా పాత అప్డేట్!!
- By Hashtag U Published Date - 07:12 PM, Fri - 20 May 22

గొడుగు కాని గొడుగు ఏది ? అంటే.. “పుట్ట గొడుగు” అని మాత్రం చెప్పకండి!! అది చాలా పాత అప్డేట్!! కొత్త విషయం ఏమిటంటే.. గొడుగు కాని ఒక గొడుగు చైనాలో అమ్మకానికి సిద్ధమైంది. దాన్ని తీసుకొని వర్షంలో నడిచే ప్రయత్నం చేశారో.. తడిసి ముద్ద అయిపోతారు. ఎందుకంటే ఆ గొడుగు పై పడే వర్షపు నీరు జారిపోదు. గొడుగు తయారీకి వాడిన వస్త్రం నీటిని పీల్చేసి, నేరుగా మనపైకి వదులుతుంది.
దీంతో బట్టలన్నీ తడిసిపోతాయి. ఎందుకూ అక్కరకు రాని ఈ గొడుగు ధర ఎంతో తెలుసా? దాదాపు రూ.లక్ష. ఎందుకంత ధర అంటే.. బ్రాండ్ వ్యాల్యూ వల్ల అని చెప్పొచ్చు. గుక్సీ, అడిదాస్ కంపెనీలు సంయుక్తంగా దీన్ని చైనా మార్కెట్లో ఆన్ లైన్ వేదికగా విక్రయించేందుకు సిద్ధం అవుతున్నాయి. జూన్ 7 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రకటనలపై చైనాలో హాట్ డిబేట్ జరుగుతోంది. ఎండ నుంచి రక్షణ కోసం తప్ప దేనికీ ఈ గొడుగు పనికి రాదని తయారీదారులు స్పష్టం చేశారు. అలంకరణ ప్రాయంగా ఉండే కలెక్షన్స్ కొనే వాళ్ళు దీన్ని కొనొచ్చని సూచించారు. కొత్త విషయం ఏమిటంటే.. గొడుగు కాని ఒక గొడుగు చైనాలో అమ్మకానికి సిద్ధమైంది. దాన్ని తీసుకొని వర్షంలో నడిచే ప్రయత్నం చేశారో.. తడిసి ముద్ద అయిపోతారు. ఎందుకంటే ఆ గొడుగు పై పడే వర్షపు నీరు జారిపోదు. గొడుగు తయారీకి వాడిన వస్త్రం నీటిని పీల్చేసి, నేరుగా మనపైకి వదులుతుంది.
దీంతో బట్టలన్నీ తడిసిపోతాయి. ఎందుకూ అక్కరకు రాని ఈ గొడుగు ధర ఎంతో తెలుసా? దాదాపు రూ.లక్ష. ఎందుకంత ధర అంటే.. బ్రాండ్ వ్యాల్యూ వల్ల అని చెప్పొచ్చు. గుక్సీ, అడిదాస్ కంపెనీలు సంయుక్తంగా దీన్ని చైనా మార్కెట్లో ఆన్ లైన్ వేదికగా విక్రయించేందుకు సిద్ధం అవుతున్నాయి. జూన్ 7 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రకటనలపై చైనాలో హాట్ డిబేట్ జరుగుతోంది. ఎండ నుంచి రక్షణ కోసం తప్ప దేనికీ ఈ గొడుగు పనికి రాదని తయారీదారులు స్పష్టం చేశారు. అలంకరణ ప్రాయంగా ఉండే కలెక్షన్స్ కొనే వాళ్ళు దీన్ని కొనొచ్చని సూచించారు.
https://twitter.com/GermanRob4/status/1527189101841104907
⚠️warning!🤣⛽️
☔️Umbrellas are not waterproof!#adidasxGucci @adidasoriginals @gucci #VirtualWorld #REALITY #Blockchain #CryptocurrencyNews #Metaverse #NFTCommunity #NFTcollectibles #NFTartist #nftcollector pic.twitter.com/xmudzHHxrW— cubist➕👽🐼🧛♂️🧟♂️🧚♀️🤖 (@cubist_pg) May 13, 2022